వైట్ల-కోన.. మళ్లీ చేయరా?

Update: 2015-10-14 11:30 GMT
టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్-రైటర్ జంటల్లో శ్రీను వైట్ల-కోన వెంకట్ జోడీ ఒకటి. వీళ్లిద్దరూ కలిసి ఢీ దగ్గర్నుంచి బాద్ షా వరకు జనాల్ని ఎలా ఎంటర్టైన్ చేశారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ‘బాద్ షా’ సినిమాతో ఇద్దరికీ ఇగో క్లాషెస్ మొదలై.. విడిపోయారు. కానీ కోన లేకుండా చేసిన ‘ఆగడు’ దారుణమైన ఫలితాన్నివ్వడంతో శ్రీను వైట్ల ఇగో పక్కనబెట్టి కోనతో కలవక తప్పలేదు. రామ్ చరణ్ వీళ్లిద్దరినీ ‘బ్రూస్ లీ’ కోసం ఒక్కటి చేశాడు. ట్రైలర్ చూస్తుంటే వైట్ల-కోన ద్వయం మరోసారి తమ కాంబినేషన్ పవర్ చూపించినట్లే కనిపిస్తోంది. వైట్ల ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌ లోకి రావడం ఖాయంగా తోస్తోంది.

అంతా ఓకే కానీ.. ‘బ్రూస్ లీ’ తర్వాత వైట్ల-కోన  జంట ఇలాగే కలిసి సాగుతుందా అనేదే డౌటు. మామూలుగా వైట్ల చాలా ఇగోయిస్టిక్ అంటారు. బాద్ షా విడుదలకు ముందు కోన మీడియా ముందు బర్స్ట్ అవడంలో తప్పేమీ లేదన్నవాళ్లూ ఉన్నారు. ఐతే తనో ఫ్లాప్ ఇచ్చి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండటం, రామ్ చరణ్ కూడా ఒత్తిడి చేయడంతో తన అహాన్నంతా పక్కనబెట్టి మళ్లీ కోనతో కలిసి పని చేశాడు వైట్ల. అవసరం కోసం తగ్గక తప్పలేదు కానీ.. ఒకవేళ ‘బ్రూస్ లీ’ హిట్టయితే మాత్రం మళ్లీ సొంతంగా సినిమా చేసుకోవడానికే మొగ్గు చూపొచ్చని అంటున్నారు. కలిసి పని చేయనైతే చేశారు కానీ.. వైట్ల - కోన మధ్య విభేదాలు మాత్రం సమసిపోలేదని.. కోన లేకుండా హిట్టు కొట్టలేడన్న అపప్రద చెరిపేయడానికైనా తర్వాతి సినిమా సొంతంగా చేసుకోవాలని వైట్ల ఆలోచిస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికైతే వైట్ల తర్వాతి ప్రాజెక్టు ఏదన్నది డిసైడవలేదు. మరి ఆ సినిమా అనౌన్స్ చేసిన రోజు చూద్దాం..అందులో కోన ఉంటాడో లేదో!
Tags:    

Similar News