'దూకుడు' చేయలేనందుకు ఇప్పటికి బాధ పడుతూ ఉంటా

Update: 2021-11-02 07:22 GMT
పలు సూపర్ హిట్‌ సినిమాలను తెరకెక్కించిన శ్రీను వైట్ల దూకుడు తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్ లను దక్కించుకోలేక పోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మళ్లీ కమర్షియల్‌ గా బిగ్‌ సక్సెస్‌ లను దక్కించుకోలేక పోయాడు. దూకుడు సినిమా గురించి ఆసక్తికర విషయాలను తాజాగా ఈటీవీలో ప్రసారం అయ్యే అలీతో సరదాగా టాక్ షో లో చెప్పుకొచ్చాడు. వచ్చే వారం టెలికాస్ట్‌ అవ్వబోతున్న శ్రీనువైట్ల ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ప్రోమోలో శ్రీనువైట్ల చాలా యాక్టివ్ గా అలీతో సరదాగా ముచ్చట్లు పెట్టాడు. తన ఫెయిల్యూర్స్ కు సమాధానం చెప్తూ మరో వైపు తన సక్సెస్ లకు సంబంధించిన విషయాలను.. తనపై గతంలో వచ్చిన విమర్శలకు సమాధానాలు చెప్తూ శ్రీను వైట్ల ఈ ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది.

శ్రీను వైట్ల మొదటి సినిమా రాజశేఖర్ తో చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. రవితేజతో మొదటి సినిమాను చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. రవితేజ తో చేసిన సినిమా నచ్చిన రామోజీరావు గారు పిలిచి తప్పకుండా సినిమా చేద్దాం అన్నాడు. అన్నట్లుగానే ఆనందం సినిమా అవకాశం ఇచ్చారు. మంచి రోజు చూసి మొదలు పెడదాం అంటే.. ఏదైనా చెడ్డ రోజు మొదలు పెట్టండి ఎందుకు ఆడదో చూద్దాం అన్నారు. దూకుడు సినిమా ను తమిళంలో అజిత్ తో రీమేక్ చేసే అవకాశం వచ్చింది. కాని కొన్ని కారణాల వల్ల రీమేక్‌ చేయలేక పోయాను. ఇప్పటికి కూడా దూకుడును తమిళంలో చేయలేక పోయినందుకు బాధగా ఉంటుందని శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు.

మహేష్ బాబు తో చేసిన ఆగడు సినిమా ప్లాప్ కు కారనం ఏంటీ అంటూ ప్రశ్నిస్తే.. మహేష్ బాబు అభిమానులు చాలా మాస్ సినిమా మాస్ సినిమా అంటూ నన్ను ఒత్తిడి చేసినంత పని చేశారు. అందుకే కాస్త తడబడ్డట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక చిరంజీవితో చేసిన అందరి వాడు సినిమాను ఎందుకు సక్సెస్ చేయలేక పోయావు అంటూ ప్రశ్నించగా.. నా కథ అయితే నేను ఖచ్చితంగా సక్సెస్ చేసుకునేవాడిని.. కాని అది వేరే వారి కథ. ఆ కథకు నేను న్యాయం చేయలేక పోయాను అన్నాడు. చిరంజీవి వంటి స్టార్స్ తో కథ చెప్పి ఒప్పించడం మామూలు విషయం కాదు అన్నట్లుగా కూడా పేర్కొన్నాడు. ఇక రూప తో నాది ప్రేమ వివాహం అన్నట్లుగా చెప్పిన వైట్ల వారి వైపు ఒప్పుకున్నారు కాని మా వాళ్లు ఒప్పుకోలేదు దాంతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నామంటూ వైట్ల చెప్పుకొచ్చాడు. పూర్తి ఇంటర్వ్యూలో మరెన్ని విశేషాలను శ్రీను వైట్ల చెప్పాడు అనేది చూడాలి.


Tags:    

Similar News