శ్రీను వైట్ల-కోన వెంకట్ బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ ఏడెనిమిదేళ్ల పాటు కలిసి పని చేశారు. ఢీ - రెడీ - కింగ్ - దూకుడు లాంటి సినిమాలతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండు సృష్టించారు. కానీ ‘బాద్ షా’ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరికీ తేడా వచ్చేసింది. వైట్లతో పడక అతడికి టాటా చెప్పేశాడు కోన వెంకట్. అంతే కాదు.. ఓ ఇంటర్వ్యూ లో వైట్ల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అతను లేవనెత్తిన ప్రధాన అభ్యంతరం.. తమ కాంబినేషన్ లో వచ్చే సినిమాలకు క్రెడిట్ అంతా శ్రీను వైట్లే తీసుకుంటాడన్నది. ‘బాద్ షా’ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటల క్రెడిట్ కూడా వైట్ల వేసుకోవడం తెలిసిందే. కోన - గోపీలకు కూడా క్రెడిట్ ఇచ్చినప్పటికీ.. తమకే రావాల్సిన క్రెడిట్లోంచి వైట్ల వాటా తీసుకోవడంపై కోన విరుచుకుపడ్డాడు అప్పట్లో.
కట్ చేస్తే కోన - గోపీ లేకుండా వేరే రచయితలతో కలిసి ‘ఆగడు’ స్క్రిప్టు రాసుకున్నాడు వైట్ల. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మళ్లీ చరణ్ సినిమా ‘బ్రూస్ లీ’ కోసం కోన - గోపీలతో కలవక తప్పలేదు. మరి ఈ సినిమా విషయంలో వైట్ల-కోన ఎంత సమన్వయంతో పని చేశారో సినిమా చూస్తే కానీ తెలియదు. చరణ్ ప్రమేయం వల్ల వైట్ల తనకు ఇష్టం లేకున్నా కోనతో కలిసి పని చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం. ఇక్కడ కోనది అప్పర్ హ్యాండ్ అయ్యింది. మరి ‘బ్రూస్ లీ’ సినిమా విషయంలో టైటిల్ క్రెడిట్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరం. ఈ సినిమాకు కథ - మాటలు కోన - గోపీనే సమకూర్చారు. ముందు వైట్ల అనుకున్న కథ పూర్తిగా పక్కకు వెళ్లిపోయి కొత్త కథ వచ్చింది. కోన - గోపీ స్క్రీన్ ప్లే సహకారం కూడా అందించారు. మరి ఇప్పుడు తెరమీద ఎవరెవరికి ఏయే క్రెడిట్ పడుతుందో చూడాలి. ‘బాద్ షా’ సినిమాకు వేసుకున్నట్లు కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం అని వేసుకోవడానికి మాత్రం వైట్లకు ఛాన్స్ ఉండకపోవచ్చు.