శ్రీను వైట్ల సినిమా అలాంటిదట!

Update: 2018-11-03 09:25 GMT
సహజంగా ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఒకరు రకరకాల కత్తుల్ని గుండెల్లోకి దించి రక్తాన్ని ఏరుల్లా పారిస్తారు. ఇంకొకరు కర్చీఫులు తడిసేలా ఏడిపిస్తే గానీ నిద్రపోరు.  మరొకరి కి బత్తాయిలు నారింజలు ఉంటే చాలు! అలానే శ్రీను వైట్లకూ ఒక స్టైల్ ఉంది.  కథ పెద్దగా ఉండకపోయినా ఇంట్రెస్టింగ్ సీన్స్ తో స్క్రీన్ పై ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతాడు.  ఇక హీరో విలన్లను బకరాలను చేసే కాన్సెప్ట్ కు శ్రీను వైట్ల కేరాఫ్ అడ్రెస్.  కానీ శ్రీను వైట్ల తాజా చిత్రం 'అమర్ అక్బర్ అంటోనీ' అలా ఉండదట.

తన రెగ్యులర్ స్టైల్లో హీరో విలన్లను బకరాలను చేసే కాన్సెప్ట్ కు కాలం చెల్లిందని గ్రహించి ఈసారి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను షాక్ చేసేందుకు రెడీ అయ్యాడట.  వరస ఫ్లాపులతో తన మార్కెట్ కూడా దెబ్బ తినడంతో ఈ సారి ఏదో ఒక స్టొరీ అని.. కథతో ఛాన్స్ తీసుకోలేదట.  ఆడియన్స్ ను మెప్పించే థ్రిల్లర్ కథాంశంతో పాటు గా తన నుండి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ను బ్యాలన్సు చేస్తూ మాస్ రాజా రవితేజ చిత్రాన్ని తెరకెక్కించాడట.  

అందుకే 'అమర్ అక్బర్ అంటోనీ' టీజర్ కాస్త సీరియస్ గా సాగిందని టాక్.  సినిమాలో కామెడీ ఉన్నప్పటికీ కావాలనే సునీల్ పాత్రను టీజర్ లో చూపించలేదట.  ట్రైలర్ లో మాత్రం థ్రిల్లర్ ఎలిమెంట్ తో పాటు కాస్త కామెడీని చూపిస్తాడని అంటున్నారు.  శ్రీను వైట్ల సినిమాల్లో కథ ఉండదనేది పెద్ద కంప్లైంటు.. మరి ఈ సారి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కథతో వస్తే అందులోనూ రవి తేజ లాంటి మాస్ హీరో ఉంటే.. విజయానికి అవకాశం ఉన్నట్టే.  
Tags:    

Similar News