ఆయన్ను చూపించే అదృష్టం నాదే - వైట్ల

Update: 2015-10-02 18:05 GMT
చరణ్ ని నాకివ్వడంతోపాటు.. చిరు కూడా బ్రూస్ లీలో చేయడం తన అదృష్టం అంటున్నాడు శ్రీను వైట్ల. మెగాస్టార్ ని మళ్లీ ఆన్ స్క్రీన్ పై చూసేందుకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే.. ఆయన్ను చూపించే అవకాశం తనకే దక్కిందంటూ సంతోషం వెలిబుచ్చాడు వైట్ల.

ఈ మూవీలో చిరుతో చేసిన మొదటి షాట్ ని ఫోటో తీసుకున్నాడట వైట్ల. దాన్ని ఫోటో ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టుకుంటానన్నాడు. చిరు ఇచ్చిన ఫ్రీడంని పక్కాగా ఉపయోగించుకున్నానని, ఆయన తనపై  ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ.. అభిమానలకు భరోసా ఇచ్చేశాడు మన బ్రూస్‌ లీ దర్శకుడు..  చరణ్ ని బోర్న్ విత్ గోల్డెన్ హార్ట్ అంటూ పొగిడిన శ్రీను వైట్ల.. చరణ్ పెర్ఫామెన్స్ పై ఎక్కువగ చెప్పనంటూనే యాక్టింగ్ ఇరగదీసేసాడని చెప్పాడు వైట్ల. ముఖ్యంగా ఈ మూవీలో చెర్రీ కామెడీ టైమింగ్ అదుర్స్ అన్నాడు. అసలు కామెడీ టైమింగ్ కి కింగ్ చిరంజీవి అయితే.. ఇప్పుడా వారసత్వాన్ని చరణ్ చూపించాడన్నాడు వైట్ల..

తమన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ గా ఉందని, హీరోయిన్ రకుల్ ప్రీత్ చాలా గ్లామరస్ గా ఉందని చెప్పుకొచ్చాడు. ఇకపోతే కోన వెంకట్, గోపీ మోహన్ లు చాలా కష్టపడ్డారు. నాతో వాళ్లు చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు బ్రూస్ లీ కోసం మళ్లీ వాళ్లు చాలా కష్టపడ్డారంటూ.. రైటర్స్ ని పొగిడేశాడు వైట్ల.
Tags:    

Similar News