ఇంతకుముందు దర్శకులు దర్శకులుగానే ఉండేవాళ్లు. నిర్మాణం వైపు చూసేవాళ్లు కాదు. కానీ ఈ మధ్య చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది దర్శకులు నిర్మాతలవుతున్నారు. తెలుగులో ఇప్పటికే పూరి జగన్నాథ్.. సుకుమార్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు ప్రొడక్షన్ వైపు అడుగులేశారు. ఇప్పుడు కొత్తగా మరో స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా వీరి బాటలోనే నడవబోతున్నాడు. తాను కూడా త్వరలోనే నిర్మాతను కాబోతున్నట్లు వైట్ల చెప్పాడు.
త్వరలోనే సొంతంగా నిర్మాణ సంస్థను ఆరంభిస్తానని.. ఐతే తనొక్కడే సినిమాలు నిర్మిస్తానా.. ఎవరితోనైనా కలుస్తానా అన్నది ఇప్పుడే చెప్పలేనని వైట్ల అన్నాడు. భవిష్యత్తులో నిర్మాతగా మారడం మాత్రం ఖాయమని.. తన దర్శకత్వంలో వచ్చే సినిమాలతో పాటు బయటి సినిమాలు కూడా చేయాలన్న ఆలోచన ఉందని వైట్ల తెలిపాడు.
ఇక ‘బ్రూస్ లీ’ తర్వాత ‘మిస్టర్’ చేయడానికి చాలా సమయం పట్టడంపై వైట్ల స్పందిస్తూ.. ‘‘ఈసారి నా గత సినిమాలకు భిన్నంగా కొత్త తరహా చిత్రం చేద్దామని అనుకున్నాను. అందుకే అన్నీ కొత్తగా ఉండేలా చూసుకున్నాను. ఆ తర్వాత ప్రేక్షకులు నా నుండి ఆశించేది కామెడీ కానుక దాన్ని కూడా కథ చెడిపోకుండా అందులో ఇన్వాల్వ్ చేయాలి. అది చాలా కష్టం. అందుకే ఎక్కువ సమయం పట్టింది’’ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/