#RRR నిర్మాత వారసుడు ఇంత సింపుల్‌ గానా?

Update: 2020-02-11 23:30 GMT
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. ఈ చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో దానయ్య దాదాపుగా 400 కోట్ల బడ్జెట్‌ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంతో దానయ్యకు ఈజీగా రెండు మూడు వందల కోట్ల వరకు మిగిలే అవకాశం ఉంది అంటూ ట్రేడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దానయ్య ఈ చిత్రమే కాకుండా అంతకు ముందు పలు పెద్ద ప్రాజెక్ట్‌ లను నిర్మించాడు. దీని తర్వాత కూడా పలువురు పెద్ద హీరోలకు అడ్వాన్స్‌ లు ఇచ్చాడు. మొత్తానికి టాలీవుడ్‌ లో టాప్‌ ప్రొడ్యూసర్‌ గా దానయ్య పేరు దక్కించుకున్నాడు. ఇంతటి క్రేజ్‌ ఉన్న దానయ్య తన కొడుకు కళ్యాణ్‌ ను చాలా సింపుల్‌ గా హీరోగా పరిచయం చేయబోతున్నాడు. పెద్దగా ఫామ్‌ లో లోని బెల్లంకొండ ఆ మద్య తన కొడుకును ఓ రేంజ్‌ లో భారీ బడ్జెట్‌ తో పరిచయం చేశాడు. కాని దానయ్య మాత్రం చాలా సింపుల్‌ గా కానిచ్చేస్తున్నాడు.

కొడుకు మొదటి సినిమాను తాను నిర్మించకుండా భరత్‌ చౌదరి అనే నిర్మాతకు నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు. అలాగే శ్రీవాస్‌ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. ఏమాత్రం క్రేజ్‌ లేని.. పెద్దగా సక్సెస్‌ ట్రాక్‌ కూడా లేని శ్రీవాస్‌ కు కొడుకు సినిమా బాధ్యతలు అప్పగించడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. అయితే కింది స్థాయి నుండి తన కొడుకును తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో దానయ్య ఇలా చేస్తున్నాడా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం తన డబ్బులు పోగొట్టుకోకుండా దానయ్య చాలా తెలివిగా కొడుకును వేరే వాళ్ల చేతిలో పెట్టాడుగా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


Tags:    

Similar News