శాతకర్ణితో శ్రియ.. కథ సమాప్తం

Update: 2016-12-01 05:52 GMT
సీనియర్ హీరోయిన్లకు గడ్డుకాలం నడుస్తోందని.. పలువురు సీనియర్ భామలతో పాటు శ్రియాశరణ్ కెరీర్ కూడా చివరకు వచ్చేసిందనే టాక్ వినిపించినపుడు.. నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో శ్రియకు చోటు దక్కింది. శాతకర్ణి భార్య వశిష్టీ దేవి పాత్రతో తిరిగి ఫామ్ లోకి రావాలని అనుకోంటోంది ఈ భామ.

ఇప్పుడు శాతకర్ణి షూటింగ్ పూర్తయిపోయింది. సెట్స్ నుంచి ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నందమూరి ఫ్యాన్స్ కి ఉత్సాహం తెప్పిస్తున్న శ్రియ.. ఆఖరి రోజు షూటింగ్ స్పాట్ నుంచి శ్రియ ఫోటోలు వీడియోలు కూడా పోస్ట్ చేసింది. ఆఖరి రోజు షూటింగ్ అంటున్న శ్రియ.. కంప్లీట్ అయిపోయిందంటే నమ్మలేకపోతున్నానని.. షూటింగ్ లో చాలా ఎంజాయ్ చేశానని చెబుతోంది. ఓ ఫోటోలో అయితే.. శాతకర్ణి గెటప్ లో ఉన్న బాలయ్య కేమెరా వైపు కత్తి తిప్పుతూ నవ్వుతూ ఫోజ్ ఇచ్చారు.

'ఇతను వెంకట్.. సూపర్ సూపర్ ట్యాలెంటెడ్.. అలాగే ఇతను సురేష్' అంటూ తన టీమ్ ని పరిచయం చేస్తూ వీడియో తీసిన శ్రియ.. షూటింగ్ అయిపోయిందని చెబుతూ చివర్లో కళ్లనీళ్లు పెట్టుకున్నంత పని చేసింది. గౌతమిపుత్రి శాతకర్ణికి షూటింగ్ ఫినిష్ అయిపోయిందని తెలియడంతో.. ఇక బాలయ్య అభిమానుల ఆనందానికి పగ్గాలు వేయడం కష్టమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News