శ్రియా శరణ్.. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ ఇంకా హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న ఏకైక హీరోయిన్ ఈమె ఒక్కతే. అప్పటికీ ఇప్పటికీ తరగని అందంతో మిలమిలలాడ్డం ఈ భామ స్పెషాలిటీ. ఇప్పుడైతే ఛాన్సులు తగ్గాయి కానీ.. అవకాశాలు లేకుండా మాత్రం పోలేదు. అలాగే సంపాదన విషయంలో కూడా యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు శ్రియ.
రీసెంట్ గా బాలయ్య సరసన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించేందుకు గాను.. శ్రియకు 35 లక్షల మొత్తం ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. కేవలం సినిమా పరంగా చూస్తే ఇది తక్కువ అనిపించచ్చు కానీ.. అసలు లెక్క వేరే ఉంది. ఇప్పటికీ ఏడాదికి కనీసం 2-3 సినిమాల్లో కనిపిస్తోంది శ్రియ. ఉలవచారు బిర్యానికి రీమేక్ గా వస్తున్న తడ్కా అనే హిందీ చిత్రాన్ని కూడా ప్రస్తుతం చేస్తోంది శ్రియ.
సినిమాలు కాకుండా చూస్తే.. ఏ అవార్డ్ ఫంక్షన్ కానీ సినిమా ఈవెంట్ కానీ జరిగినా.. అందులో శ్రియ డ్యాన్స్ తప్పకుండా ఉంటుంది. ఓ రేంజ్ ఉన్న ఏ ఫ్యాషన్ షో లో అయినా శ్రియ ర్యాంప్ వాక్ చేస్తుంది. 5కే-10కే రన్ లాంటి కార్యక్రమాలకు రిబ్బన్ కట్ చేసేందుకు కూడా శ్రియనే కావాలి. అన్నిటికీ మించి గోల్డ్-శారీ మాల్స్ ఓపెనింగ్స్ అయితే లెక్కకు మించి చేస్తూనే ఉంటుంది. ఇన్నేసి అవకాశాలు ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లకు కూడా లేవనే చెప్పాలి. మొత్తం మీద ఏడాదికి 2 కోట్ల వరకూ శ్రియ వెనకేసుకుంటోందని టాక్. ఇది రెజీనా, రాశి ఖన్నా లాంటి యంగ్ హీరోయిన్ల ఏడాది సంపాదన కంటే చాలా ఎక్కువ అనే విషయం గుర్తుంచుకోవాలి.