‘సర్దార్ గబ్బర్ సింగ్’లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఐటెం సాంగ్ వేసుకుంటున్న లక్ష్మీరాయ్ తెలుసు కదా. ఈ అమ్మాయికి అప్పట్లో ఓసారి ధోనితో ఎఫైర్ ఉందంటూ ఓ రూమర్ వచ్చింది. ఆ సంగతి ఓసారి బ్రేక్ చేసి.. ఆ తర్వాత మీడియా వాళ్లు పట్టించుకోవడం మానేశారు. కానీ లక్ష్మీరాయ్ మాత్రం సంవత్సరానికి ఒక్కసారైనా మీడియా వాళ్లకు స్పెషల్ ఇంటర్వ్యూలిస్తూ.. నాకు ధోనితో ఎఫైర్ లేదు లేదు.. అంటూ అరిచి గీపెడుతుంటుంది. మీడియా వాళ్లు అడక్కపోయినా తనే ఈ ప్రస్తావన తెచ్చి మరీ ధోనితో తన పేరు కలిపి చెప్పుకోవడం లక్ష్మీరాయ్ కి సరదా. ఎవ్వరూ పట్టించుకోనపుడు తనకు తాను పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో భాగంగానే ఆమె ఇలా చేస్తుంటుంది.
ఇప్పుడు మన శ్రియా సరన్ వ్యవహారం కూడా ఇలాగే ఉంది. ఆమె బాహుబలి-2లో నటిస్తున్నట్లు ఎక్కడైనా రూమర్లు వచ్చాయో ఏమో కానీ.. ఓ ఇంటర్వ్యూలో మాత్రం నేను బాహుబలి-2లో నటించట్లేదు నటించట్లేదు అని ఒకటికి రెండుసార్లు నొక్కి వక్కాణించింది శ్రియ. ‘‘రాజమౌళి గారితో ఇంతకుముందు ఛత్రపతి సినిమాకు పని చేశాను. ఆయన దర్శకత్వంలో మళ్లీ నటించాలని ఉంది. ఆయన సినిమాల్ని నేను ఎంతగానో అభిమానిస్తాను. బాహుబలి సినిమాను నాలుగుసార్లు చూశాను. అయితే బాహుబలి-2లో నేను ఎలాంటి పాత్రా పోషించడం లేదు. రానా సరసన నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు అబద్ధం’’ అని శ్రియ చెప్పింది.
ప్రస్తుతం తన కెరీర్ గురించి చెబుతూ.. దక్షిణాదిన మంచి ఆఫర్లు వస్తున్నాయని, తన స్థాయికి తగిన పాత్రల్నే ఎంచుకుంటున్నానని చెప్పింది. తెలుగులో కెరీర్ ముగిసిపోలేదని, ప్రస్తుతం కొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయని శ్రియ చెప్పింది. కెరీర్ తొలినాళ్లలోనే చిరంజీవితో ఠాగూర్ సినిమా చేశానని.. ఆయన నటించబోయే 150వ చిత్రంలో అవకాశమొస్తే అదృష్టంగా భావిస్తానని తెలిపింది శ్రియ.