ఎక్కడికక్కడ దున్నేద్దాం.. దొరికిందేదో దోచేద్దాం. దొరికినంతా దోచుకో.. దోచినంతా దాచుకో.. సూపర్ సినిమాలోని ఈ పాట ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇది నవతరం కథానాయికలకు సరిగ్గా సూటయ్యే లిరిక్. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం ఎలానో ఈ అమ్మణ్ణులను చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. సినీవినీలాకాశంలో దొరికినంతా దోచుకోవడానికి వెనకాడని భామల్ని నేడు చూస్తున్నాం.
రేసులో దూసుకుపోవడానికి గ్లామర్ అనే అస్త్రాన్ని సూటిగా సంధిస్తున్నారు. ముఖ్యంగా సక్సెస్ స్ట్రీట్‌లో వనకన్యలా విహరిస్తున్న శ్రుతిహాసన్ వీలున్న ప్రతి వేదికపైనా తనని తాను ఆవిష్కరించుకుంటున్న తీరు, ఆ స్పీడు విస్త్రతంగా చర్చకొస్తోంది. ఇంటా బైటా ఈ అమ్మడు చెలరేగిపోతోంది. ఓ వైపు ఫోటోషూట్‌లు, మరోవైపు ర్యాంప్ షోలు వేటినీ వదిలిపెట్టడం లేదు. ప్రముఖ మ్యాగజైన్‌ల కవర్‌పేజీపై ఏమాత్రం అవకాశం ఉన్నా రెచ్చిపోతోంది. లేటెస్టుగా జూలై మాసం కాస్మోపాలిటన్ కవర్‌పేజీపై దర్శనమిచ్చింది. ఈ కవర్‌పేజీపై శ్రుతి కనిపించిన తీరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. నిన్నటికి నిన్న వెల్‌కమ్ బ్యాక్ సినిమా కోసం ఫోజులిచ్చిన తీరుగురించి ముచ్చటించుకున్నాం.
ఇక 24 గంటలైనా గడవలేదు. ఇంతలోనే మరో కొత్త అవతారంలో అమ్మడి ఫోటో షూట్ బైటపడింది. సన్నజాజి తీగ లాంటి శరీరానికి అతుక్కుపోయినట్టున్న డ్రెస్సులో అదరగొట్టేసింది. ఎత్తులను సాధ్యమైనంత అందంగా ఆవిష్కరించే ఆ డిజైన్ కుర్రాళ్ల కళ్లను తిప్పుకోనివ్వడం లేదు. ఎలా కనిపించామన్నది కాదు... జనాల అటెన్షన్ ఇటువైపు తిప్పుకున్నామా లేదా? అన్నదే ముఖ్యం.