శృతి డ్రస్‌ గురించి ఏకేస్తున్నారుగా...

Update: 2015-08-13 05:39 GMT
ఆల్రెడీ మనమే చెప్పాం.. శృతి హాసన్‌ ఉత్తి కాపీ క్యాట్ లా తయారైంది అని. అమ్మడు ఆల్రెడీ వేరే హీరోయిన్లు వేసుకున్న డ్రస్సులను తెలియకుండా వేసేసుకుంటుందిలే. అందుకే ఇలా కాపీ కొడుతోంది అనేది. అయితే శృతికి ఈ విషయం అర్ధమవుతుందో లేదో కాని, అర్జెంటుగా ఆమె తన స్టయిలిష్టును మార్చాలంటూ ఫ్యాషన్‌ సర్కిల్లో మాత్రం ఒకటే హడావుడి.

అసలు ఏదైనా ఈవెంటుకు శృతి వచ్చిందంటే చాలు.. ఈమె వేసుకున్న డ్రస్సు ఇంతకముందు ఎవరైనా హీరోయిన్‌ ఎప్పుడైనా వేసుకున్నారా అంటూ జనాలు సెర్చింగ్‌ చేసేస్తున్నారు. నిజానికి చాలామంది హీరోయిన్లకు ఇలాంటివి తప్పవు. ఎన్నోసార్లు కంగన, దీపిక ఒకే డ్రస్సును వేసుకున్నారు. తమన్నా వేసి డ్రస్సును అదితీ రావ్‌ హైదారీ వేసుకోలేదా? అయితే వాళ్ళందరూ చిన్న చిన్న హీరోయిన్లు.. శృతి మాత్రం ప్రస్తుతం టాప్‌ గేర్‌ లో దూసుకుపోతున్న హీరోయిన్‌. అందుకేనేమో ఆమెను అందరూ తెగ విమర్శించేస్తున్నారు. బయటకొస్తే చాలు.. ఈ డ్రెస్సూ అంటూ సాగదీస్తున్నారు.

ఇకపోతే ఇలాంటి క్రిటిసిజంను పెద్దగా పట్టించుకోను అంటోంది శృతి. ఎందుకంటే దానివలన పేపర్లలో వెబ్ సైట్లలో పేజీలు నిండటం తప్పించి నాకు ఏమాత్రం నష్టం ఉండదు అంటూ ధీమా వ్యక్తం చేసింది. ఏదేమైనా తండ్రిలా గడుసు మనిషేనండీ ఈ అమ్మడు.. సర్లేమ్మా.. శ్రీమంతుడు సక్సెస్‌ ను ఎంజాయ్‌ చెయ్యి.

Tags:    

Similar News