గత ఏడాది కాలం నుంచి టాలీవుడ్ లో విభిన్న కథాంశాలతో విడుదలవుతోన్న చిత్రాల సంఖ్య పెరుగుతోన్న సంగతి తెలిసిందే. మూస ధోరణికి స్వస్తి పలుకుతూ యువ దర్శకులు వైవిధ్యమైన కథ...కథనాలతో ప్రేక్షకులను - విమర్శకులనూ మెప్పిస్తున్నారు. అటువంటి పాథ్ బ్రేకింగ్ సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ లుగా నిలవగా....మరికొన్ని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. గత ఏడాది సంచలనం రేపిన `అర్జున్ రెడ్డి`....తాజా టాలీవుడ్ సెన్సేషన్ `ఆర్ ఎక్స్ 100`...వంటి చిత్రాల కోవలోనే `కేరాఫ్ కంచరపాలెం` త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. విడుదలకు ముందే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైన తొలి చిత్రంగా `కేరాఫ్ కంచరపాలెం` రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా తనపై చాలా ప్రభావం చూపిందని జక్కన్న చెప్పాడు. ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్న జక్కన్న వీడియోను రానా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఏదైనా ఒక సినిమా..... దాని ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్ల గలిగితే..... అది మనపై చాలా ప్రభావం చూపినట్లేనని జక్కన్న అన్నాడు. సినిమా చూసిన 10 రోజుల తర్వాత కూడా ఆ పాత్రలు మనను వెంటాడుతున్నాయంటే ఆ సినిమా మన మనసుకు హత్తుకున్నట్లేనని చెప్పాడు. తనపై ‘కేరాఫ్ కంచరపాలెం’ అటువంటి ప్రభావం చూపిందని కితాబిచ్చాడు. తనకు ఏదైనా సినిమా నచ్చితే బాగుందని చెబుతా అని, చూడమని జనాలకు చెప్పనని అన్నాడు. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం వెళ్లి చూడమని చెప్పాల్సి వస్తోంని - సినిమా చూస్తే నిజంగా మీరు ఎంజాయ్ చేస్తారని జక్కన్న చెప్పాడు. ఇప్పటికే ఈ చిత్రంపై క్రిష్ - సుకుమార్ ప్రశంసలు కురిపించారు. తాజాగా జక్కన్న మనసు దోచుకున్న ఈసినిమా....ప్రేక్షకులకు అంచనాలు పెంచుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా సమర్పిస్తున్న ఈ చిత్రానికి వెంకటేశ్ మహా దర్శకత్వం వహించారు. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అందరూ నూతన నటీనటులే నటించడం విశేషం.