#RRR: ఆ మూడు యాక్ష‌న్ బ్లాక్స్ గ‌గుర్పాటే

Update: 2020-02-06 04:15 GMT
స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులపై ఎన్నో సినిమాలొచ్చాయి. అయితే అవ‌న్నీ ఏదో ఒక భాష‌కు ప‌రిమితం చేసి తెర‌కెక్కించ‌డంతో వాటికి ద‌క్కిన గుర్తింపు త‌క్కువే. హిస్టారిక‌ల్ యోధుల‌పై బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు వ‌చ్చినా తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసింది త‌క్కువే. టాలీవుడ్ లో సౌత్ లో ఎన్నో ఆ త‌ర‌హాలో తెర‌కెక్కినా అవి లోక‌ల్ మార్కెట్ వ‌రకే ప‌రిమితం అయిపోయాయి. అయితే పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.రాజ‌మౌళి ఆ స‌రిహ‌ద్దుల్ని చెరిపేస్తూ.. ఈసారి భార‌త‌దేశ‌ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల ఐడెంటిటీని జాతీయ అంత‌ర్జాతీయ స్థాయికి పెంచే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌నే చెప్పాలి. #RRR చిత్రంతో మ‌రోసారి సెన్సేష‌న్స్ కి తెర తీశారు జ‌క్క‌న్న‌. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్ తో ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో నెవ్వ‌ర్ బిఫోర్ అన‌ద‌గ్గ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కులు ఈ సినిమాలో వీరాధివీరులుగా న‌టిస్తుండ‌డంతో ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌క్క‌న్న అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది. ఇక బాహుబ‌లి డైరెక్ట‌ర్ నుంచి వ‌స్తున్న సినిమాగా ఆర్.ఆర్.ఆర్ కి ప్ర‌త్యేక‌మైన క్రేజు ఉంది. ఇటు అభిమానుల‌తో పాటు బిజినెస్ వ‌ర్గాల్లోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఆ అంచ‌నాల్ని చేరువ కావాలంటే ఆర్.ఆర్.ఆర్ లో సంథింగ్ ఏదో ఉండాలి. అది ఏమిటి? అని ఆరాతీస్తే ఓ మూడు హైలైట్ సీన్స్ గురించి రివీలైంది.

ఆర్.ఆర్.ఆర్ లో కుర్చీ అంచుమీద కూచోబెట్టే మూడు యాక్ష‌న్ బ్లాక్ లు న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న తీరుగా ఉంటాయ‌న్న‌ది ఇన్ సైడ్ టాక్. ఆ మూడు యాక్ష‌న్ సీన్స్ ఏవి? అంటే.. అందులో ఒక‌టి ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్. అది తోడేళ్ల‌తో భీక‌ర పోరాటం అని తెలుస్తోంది. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రారంభించే స‌న్నివేశం అంతే ఎగ్జ‌యిట్ మెంట్ ని పెంచుతుంద‌ట‌. ఇక క్లైమాక్స్ ఫైట్ సినిమాకే త‌ల‌మానికంగా ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ఒకరితో ఒక‌రు పోటీ ప‌డుతూ బ్రిటీష్ సైన్యాల్ని తునాతున‌క‌లు చేస్తారు. ఆ పోరాటం రోమాలు నిక్క‌బొడిచేంత ఉద్రేకాన్ని క‌లిగిస్తుంద‌ని చెబుతున్నారు. అయితే ఆయా స‌న్నివేశాల్లో అవ‌స‌రం మేర విజువ‌ల్ గ్రాఫిక్స్ - ఎఫెక్ట్స్ ని పీక్స్ లో ఉప‌యోగిస్తున్నారు. టాకీతో పాటు వీ.ఎఫ్.ఎక్స్ ని ఇన్ బిల్ట్ చేసే షాట్స్ ని ప్ర‌త్యేకంగా డిజైన్ చేశార‌ని వెల్ల‌డైంది. 2019 లో ర‌క‌ర‌కాల పాన్ ఇండియా చిత్రాలు ఊహించ‌ని విధంగా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల‌య్యాయి. అయితే ఆ సినిమాలు ఫ్లాప‌వ్వ‌డానికి కార‌ణాలేంటో రాజ‌మౌళి ఇప్ప‌టికే విశ్లేషించారు. అందుకే ఆ త‌ప్పు జ‌ర‌గ‌కుండా ఆర్.ఆర్.ఆర్ విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇక యాక్ష‌న్ సీన్ అయినా సాధార‌ణ సీన్ అయినా ప్రేక్ష‌కుల్లో ఎమోష‌న్ పెంచే స‌త్తా రాజ‌మౌళికి ఉంది. అదే ఆయ‌న ప్ర‌ధాన ఆయుధం కాబ‌ట్టి .. క‌చ్ఛితంగా ఆర్.ఆర్.ఆర్ లో హాలీవుడ్ లెవ‌ల్ యాక్ష‌న్ ట్రీట్ ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. 300 - వార్ ఆఫ్ ది యారోస్ లాంటి భారీ యాక్ష‌న్ చిత్రాల స్ఫూర్తితో యాక్ష‌న్ ని కొరియోగ్రాఫ్ చేస్తుండ‌డంతో యాక్ష‌న్ హైలైట్ గా నిల‌వ‌నుంది.


Tags:    

Similar News