సూపర్ స్టార్ మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్ లో SSMB28 గ్రాండ్ లాంచ్ కోసం రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో లాంచ్ వేడుక జరగనుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.
SSMB28 కి థమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ తో అరవింద సమేత.. అల వైకుంఠపురములో చిత్రాలకు పని చేసిన పూజా హెగ్డే ఇప్పుడు మహేష్ మూవీ లో కథానాయికగా ఆడిపాడనుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రమిది. మార్చి నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళతారని సమాచారం.
ఈ వేడుకకు మహేష్ బాబు వస్తారా? అంటే.. రాకపోవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. మహేష్ తన సినిమాల లాంచింగ్ వేడుకలకు ఎప్పుడూ అటెండ్ కారు. అది ఆయన సెంటిమెంట్ కూడా. ఇటీవలి కాలంలో శ్రీమంతుడు- భరత్ అనే నేను- మహర్షి- సర్కార్ వారి పాట .. ఇలా ఏ చిత్రం ఓపెనింగ్ చేసినా మహేష్ ఈవెంట్లో కనిపించలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ తో తన కెరీర్ 28వ సినిమా లాంచ్ లోనూ అతడు కనిపించరని గుసగుస వినిపిస్తోంది.