చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సూపర్ కాంబో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల మూవీ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అన్ని అనుకున్నట్లుగా జరిగి కరోనా కాస్త కనికరిస్తే వచ్చే నెలలో సినిమా ను రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. అల వైకుంఠపురంలో వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ నుండి వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా మహేష్.. త్రివిక్రమ్ ల కాంబోలో అతడు వంటి క్లాసిక్ వచ్చింది.. అలాగే ఖలేజా వంటి విభిన్నమైన సినిమా వచ్చింది. కమర్షియల్ గా ఆ సినిమాలు నిరాశ పర్చినా కూడా ఇప్పటికి ఆ సినిమాలు జనాల్లో మంచి టాక్ ను దక్కించుకుంటూనే ఉన్నాయి.
మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా ను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ తో పాటు త్రివిక్రమ్ మూవీ కూడా షూటింగ్ జరుపబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ సభ్యులు త్వరలో యూకే వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. యూకే లో సినిమాకు సంబంధించిన మెజార్టీ పార్ట్ షూటింగ్ ను నిర్వహించబోతున్నారట. సినిమా కథానుసారంగా కథ సగం కు పైగా యూకేలో ఉంటుందని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
విదేశాల్లో షూటింగ్ అవ్వడం వల్ల కాస్త సమయం తీసుకుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని త్రివిక్రమ్ మాత్రం మరీ ఆలస్యం చేయకుండా ఈ సినిమా ను ఖచ్చితంగా వచ్చే ఏడాది సమ్మర్ లోనే విడుదల చేస్తానంటూ ఇప్పటికే చెప్పేశాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ తుది దశకు చేరుకున్నాయి. కరోన సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన వెంటనే శరవేగంగా సినిమా ను పట్టాలెక్కించి ముగిస్తామంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు.