భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. 'బాహుబలి' ప్రాంఛైజీతో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. ఇప్పుడు RRR చిత్రంతో మరోసారి సెన్సేషనల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ భారీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
వెండి తెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న.. తన సినిమాలతో ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ను అందిస్తుంటారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గని విజువల్స్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.
'ఈగ' సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్ మీద పట్టు సాధించిన దర్శకధీరుడు.. వరల్డ్ క్లాస్ టెక్నిషియన్స్ తో కలిసి 'బాహుబలి' సినిమాలతో గ్రాఫిక్స్ - వీఎఫెక్స్ అంటే ఎలా ఉండాలో చూపించారు. ఈ విషయంలో జక్కన్న ఒక బెంచ్ మార్క్ సెట్ చేయడంతో.. మిగతా ఫిలిం మేకర్స్ చిత్రాల్లో వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులకు సాధారణంగా అనిపిస్తున్నాయి.
అయితే RRR సినిమా వందల కోట్ల వసూళ్లను సాధించినప్పటికీ.. ‘బాహుబలి’ తో పోలిస్తే ఆ స్థాయిలో లేదనే కామెంట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు దక్కుతున్నాయి.
డిస్నీ - మార్వెల్ స్టార్ అలిస్ ఎక్స్ జాంగ్ - హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ మిల్లర్ - అమీ పాలెట్ హార్ట్ మన్ వంటి హాలీవుడ్ ప్రముఖులు RRR సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. వీరే కాదు పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు - ఫిలిం మేకర్స్ ఈ సినిమా చూసి మెస్మరైజ్ అయ్యారు. ఒకరి తర్వాత ఒకరు సోషల్ మీడియాలో తమ స్పందన తెలియజేస్తున్నారు.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కడం చూస్తుంటే.. రాజమౌళి నుంచి రాబోయే సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. జక్కన్న సైతం తన తదుపరి సినిమాని అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రూపొందించాలనే ప్లాన్ చేసుకుంటారు.
భారతీయ ప్రేక్షకులతో పాటుగా గ్లోబల్ ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీస్తారని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.
మహేష్ - జక్కన్నల క్రేజీ కాంబినేషన్ లో సినిమా కోసం గత దశాబ్దం కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కాంబో సెట్ అవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఏడాది SSMB29 సెట్స్ మీదకు వెళ్లనుంది.
దర్శకధీరుడితో సినిమా ఆలస్యం అయినప్పటికీ మహేష్ కు మంచే జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరి మధ్య చర్చలు జరిగినప్పుడు రాజమౌళి రేంజ్ వేరు.. ఇప్పుడు వేరు. 'బాహుబలి' 'RRR' సినిమాలతో ఆయన క్రేజ్ ఎక్కడికో పాకిపోయింది. ఇది మహేష్ కు అడ్వాంటేజ్ గా మారుతుంది.
జక్కన్న సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయాలని మహేష్ నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు దర్శకుడికి ప్రపంచ వ్యాప్తంగా లభించిన ఖ్యాతితో.. మహేష్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా ఇది సూపర్ స్టార్ ప్లస్ అవుతుందని అనుకోవాలి.
మహేష్ కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ స్టోరీని అనుకున్నట్లు రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జక్కన్న సైతం ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మహేశ్ కోసం రెండు ఆసక్తికరమైన స్టోరీ లైన్స్ రెడీగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ రెండింటిలో ఓ లైన్ ఫైనలైజ్ చేయనున్నారు.
SSMB29 చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రాజమౌళి గత చిత్రాలకు వర్క్ చేసిన సాంకేతిక నిపుణులు ఇందులోనూ భాగం కానున్నారు. రాబోయే రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించబడతాయి.