ఘటనకు స్పందిస్తే దేశభక్తులు అయినట్టేనా? కానే కాదు.. స్పందించడంతో పాటు.. కష్టంలో ఆదుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటిస్తేనే నిజమైన దేశభక్తులుగా నిరూపించకున్నట్టు. అక్షరాలా ఈ సూత్రాన్ని తూ.చ తప్పక ఆచరిస్తూ శహభాష్ అనిపిస్తున్నారు మన స్టార్లు. ఈ విషయంలో యువ స్టార్లు - స్టారాధిస్టార్లు గ్రేట్ అని నిరూపించుకుంటున్నారు. జమ్ము కశ్మీర్ బార్డర్ - పుల్వామా ఘటనలో దారుణ ఘటనపై స్టార్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడమే కాదు.. జవాన్ల కుటుంబాలకు మేం అండగా నిలుస్తాం అంటూ భారీగా విరాళాలు ప్రకటించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే పీఎంవోకి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నిధికి సెలబ్రిటీల నుంచే కోట్లలో సొమ్ము జమ అయ్యిందని తాజా సన్నివేశం చెబుతోంది.
టాలీవుడ్ స్టార్లలో విజయ్ దేవరకొండ తొలిగా ఆర్థిక సాయం విషయమై స్పందించారు. తన వంతు చెక్ ని పీఎంవోకి పంపించారు. ఆ తర్వాత ఎందరో స్టార్లు ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రకటనలు గుప్పించారు. వీళ్లలో బిగ్ బి అమితాబ్ తనవంతు సాయానికి ముందుకొస్తున్నానని ప్రకటించడమే గాక ప్రజలంతా పెద్ద ఎత్తున స్పందించాలని కోరారు. అటుపై సల్మాన్ భాయ్ కూడా ఇదే తీరుగా స్పందించారు. విజయ్ దేవరకొండ.. ఇలయదళపతి విజయ్.. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ - అజయ్ దేవగన్ - అమితాబ్ - అక్షయ్ తదితరులు విరాళాలు ప్రకటించారు. ఇప్పటికే ఆర్థిక విరాళాలు ప్రకటించిన స్టార్లలో కిలాడీ అక్షయ్ మరోసారి తనదైన శైలిలో మనసు దోచారు. తనలోని దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేశారు. అక్షయ్ ఏకంగా 5 కోట్ల మేర ప్రకటించి సంచలనం సృష్టించారు. దేశభక్తి ప్రధాన చిత్రాల్లో నటించడమే కాదు.. సందర్భం వస్తే తనలోని దేశభక్తిని ప్రదర్శించే అవకాశం అస్సలు వదులుకోనని అక్షయ్ నిరూపించారు.
ఆ తర్వాత కండల హీరో సల్మాన్ ఖాన్ 2.5 కోట్ల మేర ఆర్థిక సాయం ప్రకటించారు. మరో స్టార్ హీరో అజయ్ దేవగన్ ధీటుగానే స్పందించారు. అతడు `టోటల్ ధమాల్` టీమ్ తరపున రూ.50లక్షల ఆర్థిక సాయం పీఎంవోకి అందుతుందని ప్రకటించారు. 40 మంది సైనికుల కుటుంబాలకు ఈ మొత్తం చేరుతుందని వెల్లడించారు. దేవగన్ నిర్మాతలు, ఇతర నటీనటులు కలిసి ఇందులో తలో కొంత సాయం చేస్తున్నారు. వీళ్లతో పాటు మునుముందు అమీర్ ఖాన్ - షారూక్ ఖాన్ వంటి స్టార్లు తమ ఆర్థిక విరాళాల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ల నుంచి, ఇతర పరిశ్రమల స్టార్ల నుంచి విరాళాలు వెల్లువెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ నుంచి పలువురు బిగ్ స్టార్లు, బిగ్ షాట్స్ తమ ఆర్థిక సాయాన్ని ప్రకటించాల్సి ఉంది. తాజా గా అందిన సమాచారం మేరకు మూవీ ఆర్టిస్టుల సంఘం `మా` రూ.5లక్షల ఆర్థిక విరాళాన్ని ప్రకటించడం విశేషం. ఆ మేరకు అధ్యక్షకార్యదర్శులు శివాజీ రాజా - నరేష్ ఇనిషియేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.