స్టార్ కమెడియన్ వివేక్.. మరపురాని పాత్రలు!

Update: 2021-04-17 14:30 GMT
స్టార్ కమెడియన్ వివేక్ మరణం తమిళ సినీపరిశ్రమలో తీరని లోటుగా మారింది. ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో గొప్ప పాత్రలను చేశారు వివేక్. నిజానికి ఆయన కేవలం తమిళం వరకే కాదు ఇటు తెలుగులో కూడా వివేక్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వివేక్ చాలా దగ్గరయ్యారు. కానీ అలాంటి వ్యక్తి మరణించడం అనేది బాధాకరమే. ఆయన చేసిన సినిమాలు, పాత్రలే ఎప్పటికి మనకు గుర్తుచేస్తుంటాయి. వివేక్ కేవలం కామెడీ వరకే కాదు ఎమోషనల్ సన్నివేశాలకు కూడా వివేక్ పెట్టింది పేరు.

ఆయన నటించిన వాటిలో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన కొన్ని సినిమాలు ఇవే..

బాయ్స్: శంకర్ దర్శకత్వం వహించిన యూత్ ఫుల్ మూవీలో వివేక్ మంగళం మామగా నటించారు. ఈ సినిమాలో వివేక్ అమాయకత్వం కామిక్ టైమింగ్ ప్రేక్షకులలో నవ్వులు పుట్టించాయి. ఈ సినిమా సమయంలో వివేక్ ఒక్కడే సీనియర్ కమెడియన్.

అపరిచితుడు: ఈ చిత్రంలో వివేక్ హీరో ఫ్రెండ్ చారి పాత్ర పోషించాడు. హీరోకు చారికి మధ్య హాస్య సన్నివేశాలు ఓ రేంజిలో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా పండించారు వివేక్. ముఖ్యంగా ట్రైన్ సీక్వెన్స్, లవ్-లెటర్ సీక్వెన్స్, మరియు ఇంటరాగేషన్ గదిలో క్లైమాక్స్ ఎమోషనల్ సీక్వెన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి.

సింగం సిరీస్: ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ సిరీస్‌లో హీరో సూర్యతో కలిసి వివేక్ కానిస్టేబుల్‌ జమదగ్నిగా నవ్వులు పూయించారు. ఇందులో వివేక్ కనిపించే సన్నివేశాలు చాలా బాగా క్యాచ్ చేశారు. అనుష్కతో వివేక్ సన్నివేశాలు థియేటర్లలో బాగా నవ్వించాయి.

రఘువరన్ బి.టెక్: ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత వివేక్ కనిపిస్తారు. హీరోకు సహోద్యోగి పాత్రలో వివేక్ హెల్తీ కామెడీతో నడిపించారు. ముఖ్యంగా తన ప్రియురాలు స్వర్ణ పుష్పంతో ఫోన్ సంభాషణ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి.

కాష్మోరా: ఈ సినిమాలో కాశ్మోరా తండ్రి పాత్రలో వివేక్ నటించారు. హారర్ సన్నివేశాలలో వివేక్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు.

శివాజీ: ఈ సినిమాలో వివేక్ రజనీకాంత్ స్నేహితుడిగా కనిపించారు. వివేక్ ఈ సినిమా అంతటా కనిపించి అలరించారు. ముఖ్యంగా కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలలో జీవించారనే చెప్పాలి.
ఇలా ఎన్నో సినిమాలలో వివేక్ తన మార్క్ కామెడీతో అలరించారు. ఇప్పటివరకు నటుడుగా ఆయన ఎన్నో అవార్డులు అందుకు
Tags:    

Similar News