కర్ణాటకలో డ్రగ్స్ దందా కన్నడ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ ఇప్పటికే అరెస్ట్ అయ్యి విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా వారు ఈ దందాలో భాగస్వాములైన సినీ , రాజకీయ , అధికార ప్రముఖుల పేర్లను వెల్లడించినట్టు సమాచారం. ఈ మేరకు కర్ణాటక పోలీసులు - మాదకద్రవ్యాల నియంత్రణ మండలి సీల్డ్ కవర్ లో నివేదికను ఒకటి రెండు రోజుల్లో కోర్టులో దాఖలు చేస్తారని తెలుస్తోంది. సంజన ఇప్పటికే ఈ మేరకు నిజాలు వెల్లడించిందని.. పోలీసులు ఇతర కోణాల్లో కూడా డ్రగ్స్ తో ప్రమేయం ఉన్న వారిని కనుగొన్నట్టు సమాచారం. దీంతో చాలా మంది ఈ కేసుతో అనుబంధం ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
తాజాగా సీసీబీ పోలీసులు దర్యాప్తులో భాగంగా మరింత మంది నటులకు ఈ డ్రగ్స్ దందాలు భాగస్వామ్యం ఉన్నట్టు తేల్చారు. తాజాగా కన్నడ స్టార్ జోడీ దిగంత్, ఐంద్రితా రేకు సీసీబీ పోలీసులు నోటీసులు పంపడం కన్నడ ఇండస్ట్రీలో కలకలం రేపింది.
ఈ స్టార్ జోడీని బుధవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ ఫాజిల్,.. శ్రీలకంలోని బార్టనే అనే క్యాసినోకు వీరిని ఆహ్వానించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతోనే వారిద్దరికీ నోటీసులు జారీ అయినట్టు సమాచారం.
ఈ కేసులో ఏ6 అయిన ఆదిత్య అల్వా రిసార్ట్ పై ఈ ఉదయం సీసీబీ పోలీసులు దాడి చేశారు. మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడైన ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలిస్తున్నారు.