ఇన్ స్టాలో రోహిత్​ శర్మకు షాక్​ ఇచ్చిన భార్య రితికా..!

Update: 2022-02-23 16:30 GMT
వరుస విజయాలతో కెప్టన్​ గా రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. ఈ మధ్య వెస్టిండిస్​ తో జరిగిన టీ20 సిరీస్​ ను రోహిత్​ సేన కైవసం చేసుకుంది. మరోవైపు శ్రీలంకతో జరగనున్న సిరీస్​ కు సిద్ధం అవుతున్నాడు. మరో వైపు కెప్టెన్సీ బాధ్యతతో బిజీ బీజీగా గడుపుతున్నాడు రోహిత్​. కోహ్లి తరువాత కెప్టెన్​ స్థానానికి ఎంపికైన రోహిత్​... ఇప్పటి వరకు కేవలం టీ 20 లకు మాత్రమే బాధ్యత వహిస్తున్నాడు. అయితే తాజాగా బీసీసీఐ  తీసుకున్న నిర్ణయం ప్రకారం టెస్టులకు కూడా సారథ్యం వహించనున్నాడు.

ఇంత బిజీ బిజీగా గడిపేస్తున్న టీ ఇండియా కెప్టన్​ రోహిత్​ శర్మకు ఇంటి సెగ తగిలింది. అతని భార్య  రోహిత్​ పై అలిగింది. తాను ఫోన్​ చేస్తే సమాధానం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీసం కాల్​ బ్యాక్​ అయినా చేయాలని కోరింది. ఈ రచ్చ అంతా కేవలం సోషల్​ మీడియాలో జరిగింది. రోహిత్​ శర్మ చేసిన ఓ పోస్ట్​ కు రిప్లై ఇచ్చిన రితికా తనదైన శైలిలో భర్తకు షాక్​ ఇచ్చింది.

రితికా చేసిన కామెంట్​ ను చూసిన రోహిత్​ ఫ్యాన్స్​ ఒక్క సారిగా కంగుతున్నారు. టీం ఇండియాను ముందుండి నడిపిస్తున్న తమ అభిమాన ఆటగాడు, కెప్టన్​ అయిన రోహిత్​ పోస్టుకు  రితికా ఇలాంటి సమాధానం ఇవ్వడం ఏంటి అని తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమల్లో వైరల్​ అవుతోంది. ఇదిలా ఉంటే ఇదంత కేవలం తమాషాకు అని తెలుసుకుని కుదుట పడ్డారు.

అసలు ఏం జరిగిందంటే..?
ఇటీవల  వెస్టిండీస్​ పై గెలిచిన తరువాత రోహిత్ ఇన్​స్టాలో కొన్ని ఫోటోలను పెట్టి పోస్ట్ చేశాడు. దానికి క్యాప్షన్​ గా తన తరువాతి టార్గెట్​ లంక అని చెప్తున్నట్లుగా మార్కు వేసి పోస్ట్​ చేశాడు. దీనికి అభిమానులు లైక్​ ల వర్షం కురిపించారు. అయితే ఇందుకు భిన్నందా రోహిత్​ భార్య మరోలా స్పందించింది. అంతా బాగుంది.. కానీ నాకు ఓ సారి ఫోన్​ చెయ్ అని కామెంట్​ చేసింది.  ఆ కామెంట్​ ను చూసిన ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఆటతో పాటు భార్యను కొంచెం చూసుకోవాలి అని రోహిత్​ కు సలహా ఇస్తున్నారు.
Tags:    

Similar News