అంచనాలకు విరుద్ధంగా ఎన్టీఆర్ కథానాయకుడు కమర్షియల్ డిజాస్టర్ గా మిగలడం అభిమానుల కన్నా ఎక్కువగా ఈ సినిమాను ఎంతో ప్రేమించి ఇష్టపడి తెరకెక్కించిన క్రిష్ కే బాధ ఉంది. మహానటిని మించిపోయేలా ఓ నట దిగ్గజం కథను వెండితెరపై చూపబోతున్నాను అన్న తపన ప్రమోషన్ మొదలుకుని విడుదల తేది దాకా ప్రతి చోట కనిపించింది. అయితే ఇక్కడ సక్సెస్ ని నిర్ణయించేది బాక్స్ ఆఫీస్ వసూళ్లు కాబట్టి ఆ క్రమంలో క్రిష్ ఓడిపోయాడు. అందుకే విడుదల తర్వాత బయట ఎక్కడా కనిపించినా ముభావంగానే ఉంటున్నాడు.
ఎంతో ముచ్చటపడి మణికర్ణికను వదిలేసి మరీ ఎన్టీఆర్ ను తీసుకుంటే ఇలా అయ్యిందన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కంగనా సినిమా విషయంలో కావాలని చేసుకున్నది కాకపోయినా పరిణామాలు దాన్ని వదిలేసి బయటికి వచ్చేలా చేసాయి. దీంతో దర్శకుడిగా సగం కార్డు పంచుకోవాల్సిన పరిస్థితి. అది హిట్ అయినా ఫట్ మన్నా క్రిష్ కు ఒరిగేది పెద్దగా ఉండదు. మరోవైపు మహానాయకుడు విడుదల వచ్చే నెల ఉన్నా దాని తాలుకు జోష్ కూడా క్రిష్ లో లేదు. ఫస్ట్ పార్ట్ లో ఎక్కడ తప్పులు జరిగాయో జాగ్రత్తగా విశ్లేషించుకుని అవి మహానాయకుడులో రిపీట్ కాకుండా వారం రోజులు ఎక్కువ టైం అడిగినట్టు దానికి బాలయ్య ఒప్పుకున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
సో క్రిష్ కొంత ఊరట చెందాలి అంటే ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ రేంజ్ సక్సెస్ కావాలి. అయితే పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మహానాయకుడు అన్ని వర్గాలకు రీచ్ అవ్వడం గురించి ఇప్పుడే ఏం చెప్పలేం. సో డైరెక్టర్ గా తన పేరు మీద మూడు సినిమాలు రెండు నెలల గ్యాప్ లో వస్తున్నా దాని తాలుకు ఆనందం క్రిష్ లో ప్రస్తుతానికి లేదు. మణికర్ణిక-మహానాయకుడు రిలీఫ్ ఇస్తాయేమో విడుదల అయ్యే దాకా వేచి చూడాలి
Full View