పరిశ్రమలో ఎవరైనా స్టార్ హీరో అవకాశం ఇస్తానని చెప్పాలి వద్దనే వారు ఎవరుంటారు. కానీ ఓ పెద్ద దర్శకుడు మాత్రం వద్దు బాబోయ్ అంటున్నాడట. అసలు విషయానికి వస్తే ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన నలుగురు అగ్ర హీరోల్లో ఒకరైన స్టార్ కు ఈ మధ్య టైం అట్టే కలిసి రావడం లేదు. వంద సినిమాలు పూర్తి చేసుకుని గ్యాప్ లేకుండా ఏదో ఒక దర్శకుడితో సినిమాలు చేస్తూనే వచ్చిన ఈయనకు ఈ ఏడాది ప్రారంభంలో ఒకటి కాదు ఏకంగా రెండు డిజాస్టర్లు పలకరించడం మార్కెట్ ను తీవ్రంగా దెబ్బ తీసింది.
ఏకంగా యాభై కోట్ల దాకా నష్టం వచ్చి బయ్యర్లు లబోదిబోమన్నారు. కెరీర్ లో ఇంత పెద్ద ఫ్లాప్ ఆ హీరో సైతం చవి చూడలేదు. దాని ఫలితంగానే ముందు ఫిక్స్ చేసుకున్న సినిమా ఒకటి 40 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసుకుని దాన్ని అర్ధాంతరంగా ఆపేసి వేరే తమిళ డైరెక్టర్ తో యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు టాక్ విషయానికి వస్తే ఓ పెద్ద దర్శకుడు ఈ హీరో పిలిచి సినిమా చేస్తానని కబురు పంపుతున్నా నో అని చెబుతున్నాడట.
అసలే మార్కెట్ తగ్గిపోయి ఇబ్బందుల్లో ఉన్న అతనితో సినిమా చేస్తే కెరీర్ కు అది ఉపయోగపడకపోగా నెగటివ్ గా ప్రభావం చూపే అవకాశం ఉందని నేరుగా వద్దని చెప్పకుండా స్మార్ట్ గా తప్పించుకుంటున్నాడట. దీంతో ఈ క్రేజీ కాంబో సాధ్యమవుతుందేమో అని ఆశపడిన అభిమానులకు ఇది జరిగే ఛాన్స్ లేనట్టే. ఒకప్పుడు మాస్ సినిమాలతో రాజ్యమేలిన సదరు హీరో ఇప్పుడీ బడ్జెట్ లెక్కల వల్ల డౌన్ అయిపోయిన మార్కెట్ వల్ల ఇలాంటి పరిస్థితికి రావడం విచారకరమే.