లీగల్‌ యాక్షన్‌ కు సిద్దమైన స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌

Update: 2020-07-22 06:30 GMT
సుశాంత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌ లో పరిస్థితులు చాలా మారాయి. పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్‌ ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కరణ్‌ జోహార్‌.. ఆలియా భట్‌.. సోనమ్‌ కపూర్‌ లతో పాటు మరికొందరు స్టార్‌ వారసులను నెపొటిజంను ప్రోత్సహించే వారిని నెటిజన్స్‌ తీవ్ర పదజాలంతో దూషిస్తూ మీ వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. అందరిలోకి కరణ్‌ జోహార్‌ పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.

తనపై వస్తున్న ట్రోల్స్‌ తో కరణ్‌ ఏకంగా తన ఇన్‌ స్టాగ్రామ్‌ పేజ్‌ ను డియాక్టివేట్‌ చేసి తాత్కాలికంగా కొత్త అకౌంట్‌ ను క్రియేట్‌ చేశాడు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ని రోజులు తీవ్రమైన ఒత్తిడితో ఉన్న కరణ్‌ జోహార్‌ లీగల్‌ చర్యలకు సిద్దం అవుతున్నాడు. తనను బూతులు తిడుతూ విమర్శలు చేస్తున్న వారిపై సైబర్‌ క్రైమ్‌ లో కరణ్‌ ఫిర్యాదు చేశాడు. అలాగే గత నెల రోజులుగా తనను టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్న కంగనాపై కూడా చట్టపరమైన చర్యలకు కరణ్‌ సిద్దమయ్యాడట.

గత కొన్ని రోజులుగా తనను కొందరు సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేసి విమర్శలు చేయడం దాన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇన్నాళ్లు ఓపిక పట్టిన తాను ఇకపై వాటిని ఉపేక్షించను అంటున్నాడు. ఒక్కరు తనగురించి బ్యాడ్‌ గా ప్రచారం చేసినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మౌనంగా ఉంటే తనపై ట్రోల్స్‌ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కరణ్‌ నెల రోజుల తర్వాత స్పందించాడు. ఇప్పటికే కరణ్‌ ఈ వివాదం కారణంగా కొన్ని సినిమాలను క్యాన్సిల్‌ చేసుకున్నాడు.
Tags:    

Similar News