అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగిన సంగతి తెలిసిందే. రామ మందిరం నిర్మాణానికి అవసరమయ్యే విరాళాలను సేకరణను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రారంభించింది. దీని కోసం రాజకీయ నాయకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా తమ వంతు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విరాళం అందిస్తున్నట్లు ప్రకటించాడు. ఆలయ నిర్మాణానికి తన అభిమానులు అనుచరులు కూడా సహకారం అందించాలని కోరుతూ అక్షయ్ కుమార్ ఒక వీడియోను సోషల్ మీడియా మధ్యమాలలో షేర్ చేశాడు. తన వంతు బాధ్యతగా విరాళం అందించినట్లు పేర్కొన్న అక్షయ్.. ప్రతి ఒక్కరూ రామ మందిరానికి తమకు తోచినంత సహాయం అందించాలని కోరాడు.
కాగా, రామ మందిర్ నిర్మాణం దేశీయ విరాళాల ద్వారానే పూర్తవుతుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. దేశంలోని 5,25,000 గ్రామాలలో నిధుల సేకరణ ప్రచారం జరగనుంది. ఈ విరాళాల డ్రైవ్ జనవరి 15న నుంచి ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుందని.. రామమందిరం నిర్మాణం 36 నెలల నుంచి 40 నెలల సమయంలో పూర్తవుతుందని ట్రస్టు సభ్యులు తెలిపారు. ఇదిలావుండగా ఇటీవల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆలయ నిర్మాణానికి 5 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు బృందాన్ని కలిసి చెక్ ను అందజేశారు. ఇక దక్షిణాది హీరోయిన్ ప్రణీత కూడా రామ మందిర నిర్మాణానికి 1 లక్ష రూపాయల విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది.