టాలీవుడ్ లో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రతీ శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. అందుకే ఇక్కడ శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ వుండరు. అంతే కాకుండా ఎవరు ఎప్పుడు స్టార్ గా మారుతారో.. ఎప్పుడు ఎవరు ఎవరూ ఊహించని విధంగా ఫేడవుట్ అవుతారో చెప్పడం కష్టం. కానీ క్రేజ్ వున్నంత కాలం వారి చుట్టే ఇండస్ట్రీ తిరుగుతూ వుంటుంది. జే జేలు కొడుతూ వుంటుంది. ఒక్కసారి ఆ క్రేజ్ పోయిందా? ఆ వంక తొంగి చూడటానికి కూడా ఎవరూ సాహసించరు.
ఇప్పడు ఓ స్టార్ హీరో విషయంలో ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు సినిమా గమనాన్ని మార్చిన సినిమాని అందించిన హీరో అతను. యావత్ దేశం మొత్తం అతనికి జేజేలు పలికింది. తన సినిమాతో టాలీవుడ్ స్వరూపమే మారిపోయింది.. దేశ వ్యాప్తంగా అతని సినిమా టాలీవుడ్ కు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా మార్కెట్ స్థాయిని కూడా పెంచేసి కొత్త దారులు ఏర్పరిచింది. అయితే ఒకే ఒక్క సినిమా ఆ స్టార్ ని ఆలోచనలో పడేసింది.
అంతే కాకుండా సదరు స్టార్ హీరో చేసిన ఆ సినిమా ఫలితం కారణంగా ఆ హీరోతో సినిమాలు తీస్తున్న నిర్మాతల గుండెల్లో ఇప్పడు రైలు పరుగెడుతున్నాయి. ఈ స్టార్ హీరో చేసిన రొమాంటిక్ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలని మిగిల్చింది.
భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. దీంతో ఈ మూవీని కొన్న వాళ్లల్లో చాలా మంది భారీ నష్టాలని చవిచూశారు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నట్టుండి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారట.
సదరు స్టార్ హీరోతో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలంతా ఏకతాటిపైకి వచ్చి ఓ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నారట. ఇంతకీ సదరు నిర్మాతలంతా తీసుకున్న నిర్ణయం ఏంటంటే సదరు స్టార్ హీరో బాడీ విషయంలో, లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్ట్ గా హీరోకే తెలియజేసి ఈ విషయంలో హీరోని రిక్వెస్ట్ చేయబోతున్నారట. అంతే కాకుండా గ్రాఫిక్స్.. స్పెషల్ ఎఫెక్ట్స్ కి హీరో బాడీ, ఫేస్ విషయంలో కోట్లు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం అంగీకరించకూడదని గట్టిగా తీర్మానించుకున్నారట.
తాజా పరిణామాల నేపథ్యంలో స్టార్ హీరోతో పాన్ ఇండియాని మించి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న మేకర్స్ ఇప్పడు స్టార్ హీరో తాజా మూవీ రిజల్ట్ కారణంగా టెన్షన్ పడుతున్నారట. హీరోని నమ్మి తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ ని కేటాయించి సినిమా చేస్తున్న కారణంగా తాజా ఫలితం వారిని మరింతగా టెన్షన్ కు గురిచేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.