లేడీ ఫ్యాన్‌ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన స్టార్‌ హీరో

Update: 2023-03-17 15:08 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరో తన లేడీ ఫ్యాన్‌ వాస్తవిక పండిట్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. అభిమానం పేరుతో మితిమీరి ప్రవర్తిస్తే ఓపిక నశిస్తుందని షాహిద్‌ కపూర్ సంఘటనతో నిరూపితం అయ్యింది. చాలా కాలంగా ఫ్యాన్ ను అంటూ ఆమె చేస్తున్న పనుల వల్ల విసిగి పోయిన హీరో షాహిద్ కపూర్ ఏకంగా పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేసే వరకు వెళ్లాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... గత కొన్నాళ్లుగా వాస్తవిక పండిట్ తనకు తానుగా షాహిద్ కపూర్ యొక్క వీరాభిమానిని అంటూ చెప్పుకుంటూ వచ్చింది. అంతే కాకుండా తాను షాహిద్ యొక్క భార్యను అంటూ కూడా ప్రచారం చేసుకుంటూ ఉంది. షాహిద్‌ కపూర్ ఎక్కడ ఉంటే అక్కడకి వెళ్లి నానా రచ్చ చేస్తూ వచ్చింది. దాంతో ఆమె పై గత కొన్ని రోజులుగా షాహిద్ కపూర్ కోపంగా ఉన్నాడు.

ఇటీవల షాహిద్ కపూర్ యొక్క కారు బానెట్ పై కూర్చుని తనతో మాట్లాడాల్సిందే అంటూ డిమాండ్ చేసింది. ఇంకా పలు రకాలుగా వాస్తవిక చేస్తున్న న్యూసెన్స్ కారణంగా చిరాకు వచ్చిన షాహిద్‌ కపూర్‌ ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాహిద్ కపూర్ నుంచి వాస్తవిక దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇక షాహిద్ కపూర్ సినిమాల విషయానికి వస్తే వరుస ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో వెబ్ సిరీస్‌ ఫర్జీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ వెబ్ సిరీస్ కు మంచి స్పందన రావడంతో ముందు ముందు ఆయన నుండి సిరీస్‌ లు వస్తాయని తెలుస్తోంది. షాహిద్ కపూర్‌ సౌత్‌ స్టార్‌ హీరోల సినిమాలను రీమేక్ చేయడంపై ఆసక్తి చూపిస్తున్నాడు. త్వరలో మరో సౌత్‌ సినిమా రీమేక్ లో నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News