తమిళ స్టార్ హీరో విక్రమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇటీవలే ఆయన తనయుడు దృవ్ తో కలిసి నటించిన మహాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మహాన్ సినిమా ఓటీటీ లో విడుదల కావడం పట్ల విక్రమ్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఆయన హీరోగా నటించిన కోబ్రా సినిమాను థియేట్రికల్ రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు. విలక్షణమైన కథలను ఎంపిక చేసుకుని ప్రతి సినిమాలో కూడా విభిన్నంగా కనిపించేందుకు ప్రయత్నించే విక్రమ్ తన కొత్త సినిమా కోబ్రా లో కూడా తనదైన శైలిలో ఆకట్టుకోబోతున్నట్లుగా అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.
హీరోగా వరుస సినిమాలు చేస్తున్న విక్రమ్ త్వరలోనే సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబో సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో గత రెండు మూడు రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది.
తమిళంతో పాటు తెలుగు లో ఇంకా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉన్న దర్శకుడు మురుగదాస్. ఆయన దర్శకత్వంలో విక్రమ్ సినిమా అంటే ఖచ్చితంగా భారీ పాన్ ఇండియా మూవీ అవుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే ఈ సినిమా పై ఇప్పటి నుండే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు.
మురుగదాస్ ఈమద్య కాలంలో చేసిన సినిమాలు కాస్త గతి తప్పి నిరాశ పర్చాయి. అయినా కూడా ఆయనపై నమ్మకంను ప్రేక్షకులు కోల్పోలేదు. ఒక వేళ విక్రమ్ తో ఆయన నిజంగానే సినిమా తీస్తే మాత్రం ఖచ్చితంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా సినిమా ఉంటుందనే నమ్మకం ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
నిప్పు లేనిదే పొగ రాదు అంటారు.. కనుక ఖచ్చితంగా వీరిద్దరి కాంబో సినిమా ఉండటం వల్లే ప్రస్తుతం మీడియాలో అది కూడా తమిళ మీడియాలో ప్రథానంగా వార్తలు వస్తున్నాయి. మరి వీరి కాంబోలో సినిమా అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.