స్టార్ హీరో సతీమణి ఎఫెక్ట్..వారు విడిపోయారు!

Update: 2019-10-30 17:30 GMT
ఇండస్ట్రీలో ఎన్నో పరిణామాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఫ్రెండ్స్ విడిపోతుంటారు.. థిక్ ఫ్రెండ్స్ గా కనిపించిన వారు ఒక సంఘటన తర్వాత ఒకరి మొహం ఒకరు చూసుకోరు. ఒక్కోసారి అసలు కలవరు అనుకున్నవారు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. ఈమధ్య ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో భాగస్వాములు విడిపోయారు.  దీనికి అసలు కారణం ఏంటనేది బయట ఎవరికీ తెలియదు.

ఈ సంస్థ మొదట్లో వరసగా హిట్ సినిమాలను నిర్మించింది.  అయితే ఈమధ్య వరసగా పరాజయాలు ఎదురవుతున్నాయి.  దీంతో ఆర్ధిక సమస్యలతో భాగస్వాములు విడిపోయారని అందరూ అనుకున్నారు.  కానీ ఆసలు నిజం అది కాదట.  ఈ భాగస్వాములు విడిపోవడానికి ఒక స్టార్ హీరో భార్య కారణమట.  నిజానికి ఆ నిర్మాణ సంస్థ సదరు స్టార్ హీరోతో ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేశారు. అయితే ఆ సినిమా పట్టాలెక్కక మునుపే కథ కంచికి చేరింది.  దీనికి కారణం స్టార్ హీరో భార్యకు ప్రొడక్షన్ పార్టనర్లకు విభేదాలు రావడమేనట.  అయితే వారిలో ఒకరు మాత్రం స్టార్ హీరోకు సన్నిహితుడు కావడంతో హీరోగారి భార్య పక్షం వహించాల్సి వచ్చిందట.  మిగతా ఇద్దరూ అది వ్యతిరేకించారట. అదే బ్యానర్ లో చిచ్చుకు కారణం అయిందని టాక్.

స్టార్ హీరో గారి భార్య కావడంతో ఈ బిహైండ్ ది సీన్స్ విషయాలు ఎక్కడా బయటకు రావడం లేదట.  ఏదేమైనా ప్రొఫెషనల్ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం మితిమీరితే ఇలాంటి  అనర్థాలే జరుగుతాయి. ఎంతోమంది రాజకీయ నాయకులు.. సినీ ప్రముఖుల జీవితాలలో ఇలా జరిగింది. ఈ స్టార్ హీరో సతీమణి వ్యవహారం ఇంతటితో ఆగుతుందో లేదో మరి.


Tags:    

Similar News