మాజీ భర్త పోస్ట్ పై స్టార్ హీరోయిన్ క్రేజీ కామెంట్..!

Update: 2021-06-01 11:35 GMT
సినీప్రపంచం అంటే కేవలం హీరోలు హీరోయిన్స్ సినిమాలే ఆలోచిస్తారు అభిమానులు. కానీ సినిమా తారలకు కూడా పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. అవి ఊహించుకుంటే అందంగా ఉంటాయేమో అనిపించవచ్చు లేదా రియాలిటీకి వస్తే అన్ని కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలనే ఫేస్ చేస్తుండవచ్చు. కానీ ఫ్యాన్స్ ఇవేమి పట్టించుకోరు. ప్రెసెంట్ తమ అభిమాన హీరో హీరోయిన్ ఏం చేస్తున్నారు.. ఏ సినిమాతో సిద్ధం అవుతున్నారు.. హీరోయిన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో ఉంటుందా లేదా అనే ప్రశ్నల వరకే ఆలోచిస్తారు. కానీ వారికంటూ ప్రత్యేకమైన పర్సనల్ లైఫ్ ఉంటుంది.

ఆ లైఫ్ ఎలా ఉన్నప్పటికీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మాత్రం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. అలా మ్యారేజ్ అయినటువంటి హీరోయిన్ కొన్నేళ్లకు భర్తతో విడాకులు తీసుకొని ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.. అతిథిరావు హైదరి. ఈ భామకు మిలియన్స్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగి ఉంది. కానీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చాలా సాడ్. అందుకే ఎప్పుడు కూడా అతిథి తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా మాట్లాడదు. అలాగే ఎవరితో అడిగించుకునే సందర్బం కూడా తెచ్చుకోలేదు. బేసిగ్గా అతిథి కేవలం సినిమాల వరకే ఆలోచిస్తుంది. తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఇలాంటి గ్లామర్ బ్యూటీకి 12ఏళ్ల క్రితమే పెళ్లి అయిపోయిందని తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

అవును అతిథి.. నటుడు సత్యదీప్ మిశ్రాను 2009లో వివాహం చేసుకుంది. కానీ ఏమైందో తెలియదు నాలుగేళ్లకు ఈ జంట విడిపోయారు. కానీ వీరద్దరిది చాలా సంవత్సరాల పరిచయం కాబట్టి ఇద్దరూ ఇప్పటికి స్నేహితులుగా కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇటీవలే మాజీ భర్త సత్యదీప్ ఇంస్టాగ్రామ్ వేదికగా తన పెట్ డాగ్ తో కలిసి దిగిన సెల్ఫీ పిక్ పోస్ట్ చేసాడు. ఆ ఫోటోకు చాలామంది కామెంట్స్ చేశారు. అందులో అతిథి కూడా కామెంట్ చేసింది. అందరి కామెంట్స్ పక్కన పెడితే ప్రస్తుతం ఈ మాజీ భార్య కామెంట్ వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం సత్యదీప్ తన సహనటి మసాబా గుప్తాతో రిలేషన్ లో ఉన్నాడట. అతిథి ప్రస్తుతం సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేసుకుంటుంది.
Tags:    

Similar News