రెడ్డిని తట్టుకోవడానికి ఛానల్ రెడీ

Update: 2017-10-02 10:12 GMT
'అర్జున్ రెడ్డి'. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు కూడా ఇంత హైప్ రాలేదు. బహుశా ఈ సినిమాలోని బూతు కంటెంట్ ను చక్కగా ట్రైలర్లో పెట్టేయడం.. టీజర్లలో దంచేయడం వలనేనేమో.. అసలు ఈ సినిమా ఒక ఫీవర్ తరహాలో జనాలకు ఎక్కేసింది. కాస్త నిధానంగా చూస్తే సినిమాలో పెద్దగా కంటెంట్ ఏముందిలే అనిపించవచ్చు కాని.. ఆ లవ్ కమెస్ర్టీని దర్శకుడు సందీప్ పండించిన తీరు.. అలాగే హీరో విజయ్ దేవరకొండ చూపించిన యాటిట్యూడ్ కూడా అందరికీ బాగా నచ్చేసింది.

అప్పట్లో వచ్చిన టాక్ ఏంటంటే.. ఈ సినిమాలోని వయలెంట్ మరియు కాస్త ఎడల్డ్ తరహాలో సాగే కంటెంట్ ను టివిలో వేయడం కాస్త కష్టమే అవుతుందని. ఎందుకంటే టివిలో సినిమాలో వేయాలంటే.. ఖచ్చితంగా దానికి 'యు' సర్టిఫికేట్ కావాలి. ఇదేమో 'ఎ' స్టాంపు వేయించుకున్న సినిమా మరి. అందుకే ఈ సినిమా ఏ ఛానల్ వేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ మా వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కొనేసినట్లు తెలుస్తోంది. సినిమా హిట్టయ్యింది కాబట్టి.. కట్లు ఎన్ని పడినా కూడా సినిమాను ప్రసారం చేస్తే మాంచి వ్యూయర్ షిప్ ఉంటుంది. అందుకే స్టార్ మా వారు ఏకంగా 3.5 కోట్లు చెల్లించి.. ఆల్రెడీ రేసులో ఉన్న జీ టివి వారిని బీట్ చేస్తూ ఈ సినిమాను కొనేశారని ఇండస్ర్టీలో టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి 'ఏం మాట్లాడుతున్నావ్ రా.. #$@%!$@$'' అనే డైలాగును ధియేటర్లలో ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఇప్పుడు టివిల్లో కూడా ఎంజాయ్ చేయడానికి సిద్దపడిపోవచ్చు. అయితే అలాంటి డైలాగులు సీన్లూ ఎంతవరకు టివిల్లో కనిపిస్తాయ్ వినిపిస్తాయ్ అనేది మాత్రం పెద్ద ప్రశ్నే. కాకపోతే ఎన్ని కట్లు పడినా కూడా ఈ రెడ్డిన తట్టుకోవడానికి మేం రెడీ అన్నట్లుంది సదరు టివి ఛానల్ డెసిషన్.
Tags:    

Similar News