'జాతిరత్నాలు'లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన స్టార్ యాక్టర్స్..!
నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ''జాతిరత్నాలు'' మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వెరైటీ ప్రమోషన్స్ తో రిలీజ్ కి ముందే బజ్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్.. ఈరోజు థియేటర్స్ లో సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్స్ కి రెండు సర్ప్రైజెస్ ఇచ్చారు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరియు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ 'జాతిరత్నాలు' సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారని తెలుస్తోంది.
సినిమా ఫస్ట్ హాఫ్ లో కీర్తి.. సెకండ్ హాఫ్ లో వీడీ కనిపించి ప్రేక్షకులను షాక్ కి గురి చేశారు. కీర్తి సురేష్ - విజయ్ ఇద్దరూ కూడా నాగ్ అశ్విన్ తో క్లోజ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించిన 'మహానటి' సినిమాలో వీరిద్దరూ నటించారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' నుంచే నాగ్ అశ్విన్ తో టచ్ లో ఉన్న విజయ్ దేవరకొండ 'జాతి రత్నాలు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా గెస్ట్ గా హాజరయ్యాడు. ఇక నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ముగ్గురూ విజయ్ తో ఎంత స్నేహంగా ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పరిచయంతోనే కీర్తి - విజయ్ 'జాతిరత్నాలు' సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించారు.