మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కెరీర్ పరంగా ప్రస్తుతం ప్లానింగులో రకరకాల మార్పులు చేసిన సంగతి తెలిసిందే. భారీ పాన్ ఇండియా చిత్రం `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` డిజాస్టర్ అయిన తర్వాత అతడు స్క్రిప్ట్ ఎంపిక కోసమే చాలా సమయం తీసుకున్నాడు. ఇటీవల లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఆస్కార్ మూవీ `ఫారెస్ట్ గంప్`కి రీమేక్. మొన్ననే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజై అభిమానులకు చేరువైంది. ఈ చిత్రంలో అమీర్ ఒక సింపుల్ సిక్కు యువకుడిగా కనిపిస్తున్నారు.
ఈ సినిమా చేస్తుండగానే.. మరోవైపు తన స్నేహితుడు అయిన టీసిరీస్ అధినేత గుల్షన్ కుమార్ బయోపిక్ కి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వేరొక స్నేహితుడు అమిన్ హజీ సాయంతో వెబ్ సిరీస్ ల నిర్మాణానికి అమీర్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అందుకోసం సొంత ఓటీటీ వేదికను తయారు చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందట.
ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ ల ట్రెండ్ ఊపేస్తోంది. బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లోనూ ఓటీటీ వేదికపై నిరూపించుకునేందుకు దిగ్గజాలంతా బరిలో దిగుతున్నారు. సౌత్ లోనూ అల్లు అరవింద్ .. కళ్యాణ్ రామ్.. సహా ఎందరో సొంతంగా ఓటీటీ వేదికలకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఉంది. అటు బాలీవుడ్ లోనూ దిగ్గజాలంతా ఈ రంగంలోకి దిగిపోతున్నారు. ఇప్పుడు అమీర్ ఖాన్ లాంటి స్టార్ ఈ వేదికకు రెడీ అవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రయత్నం.. ప్రయోగం వల్ల నవతరం ట్యాలెంటుకు విస్త్రతంగా అవకాశాలు లభిస్తాయనడంలో సందేహం లేదు. ఇటీవలే ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ) లో రకరకాల టైటిల్స్ ని రిజిస్టర్ చేయించిన అమీర్ త్వరలోనే సొంత నిర్మాణ సంస్థల్లో వీటిని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ వేదికపైనా దృష్టి సారించారని తెలుస్తోంది.