అత్తారింటికి దారేది సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంగతి చెప్పాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. చాలా ఏళ్ల కిందట తాను దర్శకుడిగా మారుదాం అనుకున్నపుడు కథ చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లానని.. ఐతే తాను కథ చెబుతుండగా పవన్ నిద్రపోయాడని.. తాను కథ పూర్తి చేసి నిరాశగా ఇంటిముఖం పట్టానని వెల్లడించాడు. అక్కణ్నుంచి వేరే టాపిక్ లోకి వెళ్లిపోయిన త్రివిక్రమ్.. తాను పవన్ కు చెప్పిన కథేదో మాత్రం వెల్లడించలేదు. ఆ కథ వేరే వాళ్లెవరికైనా చెప్పి సినిమా చేశాడా.. లేక దాన్ని చెత్త బుట్టలో వేశాడా అన్నది జనాలకు తెలియలేదు. ఐతే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో ఆ కథ తాలూకు అసలు విషయం వెల్లడించాడు. పవన్ ని నిద్ర పుచ్చిన కథ మరేదో కాదు.. అతడు.
అవును.. అతడు కథను త్రివిక్రమ్ ముందు వినిపించింది పవనుడికేనట. ఐతే అప్పుడు పవన్ ఎలాంటి మూడ్ లో ఉన్నాడో కానీ నిద్రపోయాడు. నచ్చిందీ నచ్చలేనిది కూడా చెప్పలేదట. అయినా తన కథ మీద నమ్మకం సడలని త్రివిక్రమ్ మహేష్ దగ్గరికెళ్లాడు. ఐతే మహేష్ కూడా కథ వినగానే ఏమీ మాట్లాడలేదట. చక్కగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడట. దీంతో త్రివిక్రమ్ అయోమయంలో పడిపోయాడట. కానీ కాసేపటి తర్వాత లోపలికొచ్చి.. ‘‘కథ అద్భుతంగా ఉంది, నాన్నగారికి కూడా చెప్పాను. మా సొంత బేనర్ లోనే ఈ సినిమా తీద్దాం’’ అన్నాడట. ఐతే జయభేరి కిషోర్ కు ముందే కమిట్మెంట్ ఇవ్వడం వల్ల ఆయన నిర్మాణంలోనే అతడు చేశాడు త్రివిక్రమ్. ఐతే త్రివిక్రమ్ మహేష్ కు ఈ కథ చెప్పింది ఎప్పుడో తెలుసా? టక్కరిదొంగ షూటింగ్ జరుగుతున్న సమయంలో. అప్పటికి త్రివిక్రమ్ తొలి సినిమా ‘నువ్వే నువ్వే’ కూడా మొదలవలేదు. ఐతే సినిమా ఓకే అనుకున్న మూడేళ్ల తర్వాత మొదలైంది. విడుదల తర్వాత ‘అతడు’ సినిమాకు లభించిన ఆదరణ, అప్రిసియేషన్ గురించి కొత్తగా చెప్పేదేముంది? అంతా సరే కానీ.. ‘అతడు’ సినిమాను పవన్ చేసి ఉంటే ఎలా ఉండేదో ఓసారి ఊహించుకుని చూడండి.