కిస్సుల కుమారిగా ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ ఇచ్చిన ఎంట్రీ గురించి తెలిసిందే. ఆరంభమే సెన్సేషన్స్ తో పరిశ్రమ వర్గాల దృష్టిని ఆకర్షించిన హెబ్బా అటుపై వరుసగా అరడజను పైగానే చిత్రాలకు సంతకాలు చేసింది. అవన్నీ చాలా తక్కువ గ్యాప్ తో తన వెంట పడిన ఆఫర్స్. అయితే కుమారి హడావుడిగా తప్పులో అడుగేసిందని అర్థమవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. వెల్లువలా వచ్చింది. వెల్లువలా తనవైపు వచ్చిన ఏ ఆఫర్ ని అస్సలు విడిచిపెట్టలేదు. అయితే ఈ యాటిట్యూడ్ తనకి ప్లస్ అయ్యిందా.. మైనస్ అయ్యిందా? అన్నది విశ్లేషిస్తే దాని వల్ల హెబ్బాకి పెద్ద డ్యామేజ్ జరిగిందనే తాజా సీన్ చెబుతోంది.
కుమారి 21 ఎఫ్ తో బ్లాక్ బస్టర్ కొట్టాక ఈడోరకం - ఆడోరకం.. ఎక్కడికి పోతావు చిన్నవాడా?.. మిస్టర్.. నాన్న నేను బోయ్ ఫ్రెండ్.. అంధగాడు.. ఏంజెల్.. ఇలా వరుసగా సినిమాల్లో నటించింది. వీటిలో ఎక్కడికి పోతావు చిన్నవాడా? మినహా అన్ని ఫ్లాపులు గా నిలిచాయి. ఆ ప్రభావం తన కెరీర్ పై పడింది. ఆ క్రమంలోనే 24 కిస్సెస్ అంటూ మరో బోల్డ్ సినిమాతో సత్తా చాటాలని ఆశించింది. కానీ డీగ్రేడ్ కంటెంట్ తో ఇక్కడ నెగ్గుకు రాలేమని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తెలిసి చేసిన తప్పునో.. లేక స్వయంకృతమో మొత్తానికి హెబ్బా కెరీర్ కి బిగ్ బ్రేక్ పడిపోయిందని అర్థమవుతోంది.
24 కిస్సెస్ తర్వాత వేరొక ఆఫర్ లేనేలేదు. ప్రస్తుతం కెరీర్ ఖాళీ. దీంతో హెబ్బా పూర్తిగా డీలా పడిపోయిందని అర్థమవుతోంది. ఇప్పటికైతే ఏదో అలా సోషల్ మీడియాలో అభిమానులకు ఫోటోషూట్లు షేర్ చేయడం తప్ప హెబ్బా కి ఛాన్సుల్లేవ్. ఇక టాలీవుడ్ లో అందం కంటే ట్యాలెంటుతో నెగ్గుకొచ్చిన హెబ్బా ఘనమైన ఆరంభాన్ని ఎక్కువ కాలం సస్టెయిన్ చేయడంలో తడబడిందనే చెప్పాలి. తెలుగుతో పాటు తమిళం.. కన్నడంలోనూ ఈ అమ్మడికి సరైన అవకాశాల్లేవ్. కన్నడలో అధ్యక్ష అనే చిత్రంతో.. తమిళంలో `తిరుమనం ఎనుం నిఖా` అనే చిత్రంతో 2014లోనే పరిచయమైనా అక్కడ ఆఫర్లు లేవు ఎందుకనో. 2014లో వచ్చిన అలా ఎలా? అనే చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైనా.. 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్ కు గుర్తింపునిచ్చింది. తెరపై ఎలాంటి బోల్డ్ సీన్స్ కి అయినా అబ్జెక్షన్ చెప్పని కథానాయికగా పేరు తెచ్చుకోవడంతో తనకోసం వచ్చిన కథలు బోల్డ్ కంటెంట్ తోనే వచ్చాయి. దాని ప్రభావం హెబ్బా కెరీర్ పై పడిందని భావించవచ్చు.