క‌ల్కి ఈవెంట్ క్యాన్సిల్ వెన‌క క‌థ‌?

Update: 2019-06-26 10:25 GMT
యాంగ్రీ హీరో రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో `క‌ల్కి` తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈనెల 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది టీమ్. ప్ర‌స్తుతం చిత్ర‌బృందం ప్ర‌చారంలో బిజీబిజీగా ఉంది. నేటి సాయంత్రం `క‌ల్కి` ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఈ వేడుక క్యాన్సిల్ అయ్యిందంటూ  మీడియాకి తాజాగా స‌మాచారం అందింది.

స‌డెన్ గా క్యాన్సిల్ చేసారు.. కారుణ‌మేంటి? అని ఆరాతీస్తే.. ఈ ఈవెంట్ మాత్ర‌మే కాదు.. రాజ‌శేఖ‌ర్ పాల్గొనాల్సిన ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్రమాల‌న్నీ క్యాన్సిల్ అయ్యాయ‌ని తెలుస్తోంది. దీనికి కార‌ణం.. రాజ‌శేఖ‌ర్ గ‌త కొద్ది రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారట‌. ఇటీవ‌ల షూటింగుల ఒత్తిడి వ‌ల్ల ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు తలెత్తాయి. జ్వ‌రం పూర్తిగా త‌గ్గ‌క‌పోవ‌డంతో క‌ల్కి ప్ర‌మోష‌న్స్ ని వాయిదా వేశారు. ఆరోగ్యం కుదుట‌ప‌డ‌గానే తిరిగి రాజ‌శేఖ‌ర్ ప్ర‌చారం కొన‌సాగిస్తార‌ని తెలుస్తోంది.

క‌ల్కి తో పాటుగా ఈ వారం మ‌రో రెండు సినిమాలు (బుర్ర‌క‌థ - బ్రోచేవారెవ‌రురా) రిలీజ్ కి వ‌స్తున్న సంగ‌తి విదిత‌మే.. ఈ మూడూ వేటిక‌వే డిఫ‌రెంట్ జోన‌ర్ల‌లో వ‌స్తున్నాయి. ఏ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో అంటూ ట్రేడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. క‌ల్కి చిత్రంలో రాజ‌శేఖ‌ర్ కాప్ రోల్ లో న‌టిస్తున్నారు. ఆయ‌న ఆహార్యం హైలైట్ గా ఉంటుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఇక ఈ సినిమాతో పోటీప‌డుతున్న ఆది సాయికుమార్ బుర్ర‌క‌థ.. శ్రీ‌విష్ణు బ్రోచేవారెవ‌రురా కొత్త‌గా ట్రై చేస్తున్న‌వే. విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో వేచి చూడాల్సిందే. న‌వ‌త‌రం ట్యాలెంట్.. కొత్త‌ద‌నం నిండిన క‌థ‌ల్ని ఎంచుకున్నా నేరేట్ చేసిన‌ విధానం.. ఎమోష‌న్ క‌నెక్ట‌యితేనే విజ‌యం ద‌క్కుతుంద‌న్న సంగ‌తి ఇప్ప‌టికే ప్రూవైన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News