ఆకాశాన్ని తాకిన చూపులైనా వెనక్కి వస్తాయేమోగానీ, అందాన్ని తాకిన చూపులు మాత్రం వెనక్కి రావు. సముద్రంలోని నీళ్లు ఆవిరి అవుతాయిగానీ, ఊరించే సొగసుల వలన పుట్టిన ఊహలు ఆవిరికావు. హంసలా వయ్యారాలు పోయే అందగత్తెలను అనుసరించాలనీ, కలల వనంలో ఆ సుందరి చేసే అల్లరి పనులను కలవరించాలని కుర్రమనసులు కోరుకుంటాయి. అలాంటి అందం ఎక్కడున్నా కన్నె మనసులు కందిరీగలై చేరుకుంటాయి. ఆ అందం వాకిట్లో ఒలికిపోయిన వలపు ముత్యాలను ఏరుకుంటాయి. అలాంటి అందానికి వారసురాలిగా 'ఊర్వశి రౌతేలా' కనిపిస్తుంది.
బాలీవుడ్ భామల్లో 'ఊర్వశి రౌతేలా' స్థానం ప్రత్యేకం. స్టార్ హీరోయిన్స్ రేసులో ఆమె లేకపోయినా, ఆ రేసులో ఉన్నవాళ్లు సైతం అసూయపడే అందం ఆమెది. బ్లాక్ బస్టర్ హిట్లు పెద్దగా లేకపోయినా, వరుసహిట్లు కొడుతున్న వాళ్లు మూతి ముడుచుకునే కాడమల్లే ఈ పిల్ల. ఫిట్ నెస్ కి పర్యాయపదంలా కనిపించే 'ఊర్వశి' అంటే కుర్రకారు వెర్రెత్తిపోతారు. ఆమె అందాలను చూస్తూ అలసిపోతారు. 'మానస సరోవరం' సమీపంలో ఇప్పుడే దిగిన హంసలా తెల్లగౌనులో కనిపిస్తున్న ఈ అమ్మాయిని చూస్తే కళ్లు తిప్పుకోవడం కష్టమే. ఆ క్షణంలో కనురెప్ప వేసినా అది అపారమైన నష్టమే.
'ఊర్వశి రౌతేలా'ను చూడగానే పాలరాతి శిల్పానికి ప్రాణం పోసినట్టుగా అనిపిస్తుంది. పాలపొడిలో తేనెకలిపి పోతపోసినట్టుగా కనిపిస్తుంది. వాకిళ్ల వంటి కళ్లు .. తేనె వాగుల్లో తేలే పగడాల పడవల్లా పెదాలు .. సన్నజాజులు చిన్నబుచ్చుకునే నాసిక .. ఇలా ఒకటేమిటి ఊర్వశి అందాన్ని వర్ణించాలంటే కాళిదాసే కలం పట్టుకుని రావాలి .. అలాంటి బొమ్మ గీయాలంటే రవివర్మనే కుంచె పట్టుకుని రంగంలోకి దిగాలి. అందాన్ని కొలవడం ఈజీనే .. దానిని గెలవడమే కష్టమని అందుకే అంటారు మరీ.