పిక్ టాక్ : స్టైలిష్ బ్యాగ్ తో స్టైలిష్ పీసీ

Update: 2021-07-17 03:51 GMT
గ్లోబల్ స్టార్‌ ప్రియాంక చోప్రా ఇన్ స్టాగ్రామ్‌ లో దాదాపుగా 66 మిలియన్‌ ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఆమె ప్రతి పోస్ట్‌ కూడా కొన్ని కోట్ల మందికి రీచ్ అవుతుంది. ముఖ్యంగా ఈమెకు విదేశాల్లో అత్యధికులు అభిమానులు మరియు ఫాలోవర్స్ ఉన్నారు. కనుక ఈమె తన ఇన్ స్టా లో ఒక్క యాడ్‌ పోస్ట్ ను షేర్‌ చేస్తే కోట్ల రూపాయల పారితోషికంను దక్కించుకుంటుంది.

ఇండియన్‌ సెలబ్రెటీల్లో అత్యధిక రెమ్యూనరేషన్‌ యాడ్‌ పోస్ట్‌ కు తీసుకుంటున్న స్టార్‌ గా ప్రియాంక చోప్రా నిలిచింది అనడంలో సందేహం లేదు. అలాంటి పీసీ తాజాగా ఈ ఫొటోను షేర్‌ చేసింది.

ఫెండీ అనే బ్రాండ్‌ బ్యాగ్ లను ప్రియాంక చోప్రా ప్రమోట్‌ చేస్తుంది. గతంలో కూడా ఆ బ్యాగ్‌ తో సందడి చేసింది. స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో ఆకట్టుకునే లుక్ తో ప్రియాంక చోప్రా ఈ బ్యాగ్ ను ధరించి అలా నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఈమె స్టైల్‌ కు ఐకాన్ అన్నట్లుగా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తుంటే కొందరు మాత్రం ఈమె స్టైల్‌ అద్బుతం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్‌ లోనే కాకుండా హాలీవుడ్‌ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు కూడా చేస్తూ బిజీగా ఉంది. కనుక ఈ అమ్మడు నెట్టింట ఎంతో పాపులారిటీని దక్కించుకుంది.

బాలీవుడ్ లో ఈ అమ్మడు చేసే ప్రతి సినిమాకు గాను భారీ పారితోషికంను అందుకుంటూనే ఉంది. నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె అంతర్జాతీయ స్థాయి సెలబ్రెటీగా మారిపోయింది. అందుకే ఈమె పోస్ట్‌ లకు అంత డిమాండ్‌.
Tags:    

Similar News