సినిమాల్లోనే కాదు బయట కనిపించాలన్నా హీరోయిన్స్ కు వారు కావాల్సిందేనట!

Update: 2022-04-08 08:20 GMT
ఒకప్పుడు హీరోలు అయినా హీరోయిన్స్ అయినా సినిమాల్లో నటించినప్పుడు వారికి కాస్ట్యూమ్స్ డిజైనర్స్ ఉండే వారు. సినిమాకు వర్క్ చేసే కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ చెప్పినట్లుగా డ్రస్ లు వేసుకుని నటించే వారు. సాదారణ సమయంలో రెగ్యులర్ వేర్‌ ధరించే వారు. కాని ఇప్పుడు మాత్రం సెలబ్రెటీలు పర్సనల్‌ డిజైనర్స్‌ ను పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ బయట కనిపించాలంటే ఖచ్చితంగా పర్సనల్‌ కాస్ట్యూమ్‌ డిజైన్స్ ఉండాల్సిందేనట.

ఒక్కరు ఇద్దరు హీరోయిన్స్ మినహా మిగిలిన అందరు హీరోయిన్స్ కూడా చిన్న సందర్బంకు కూడా తమ పర్సనల్‌ కాస్ట్యూమ్స్ డిజైనర్‌ తో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్స్ కు ఒకప్పుడు పర్సనల్‌ కాస్ట్యూమర్స్ ఉండే వారు. కాని ఇప్పుడు టాలీవుడ్‌ లో మీడియం రేంజ్ హీరోయిన్స్ నుండి స్టార్‌ హీరోయిన్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైనర్స్ ఉంటున్నారు.

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్‌.. రష్మిక మందన్నా.. పూజా హెగ్డే.. సమంత ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ అందంను మరింతగా పెంచుకునేందుకు పర్సనల్ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ మరియు పర్సనల్‌ మేకప్ ఆర్టిస్టులను హైర్ చేసుకుంటున్నారు. వారు ఈ స్టార్‌ హీరోయిన్స్ అందంను మరింత అందంగా చూపించేందుకు ప్రతి రోజు... ప్రతి గంట వర్క్ చేస్తూనే ఉంటారట.

కొందరు హీరోయిన్ లు మాత్రమే మేకప్ లేకుండా బయటకు వచ్చేందుకు సాహసిస్తారు. కాని మెజార్టీ హీరోయిన్స్ మాత్రం కార్యక్రమం ఏదైనా.. బయటకు వెళ్లాలి అంటే మాత్రం ఖచ్చితంగా వారి సాయం ఉండాల్సిందే. హీరోయిన్స్ మాత్రమే కాకుండా హీరోలు కూడా ఎంతో మంది తమ వ్యక్తిగత స్టైలిష్ట్ లను మెయింటెన్ చేస్తూ ఉంటారని సమాచారం అందుతోంది.

హీరోయిన్ లు ఈమద్య కాలంలో రెట్టింపు అందంతో కనిపిస్తూ ఉన్నారు. కెరీర్‌ ఆరంభంలో ఉన్న అందంకు రెట్టింపు అందంను ఇప్పుడు హీరోయిన్స్ ను కలిగి ఉన్నారంటూ మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం.

ఆ రెట్టింపు అందం ఈ స్పెషలిస్ట్‌ ల వల్లే అంటే ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. హీరోయిన్స్ మేకప్‌ మరియు కాస్ట్యూమ్స్ ఖర్చు సినిమాల నిర్మాతలకు భారంగా మారుతుందట.
Tags:    

Similar News