సెలబ్రిటీ వరల్డ్ లో ప్రేమించుకున్న వారంతా పెళ్లి వరకూ వెళ్లరు. మధ్యలోనే ఆ బంధాలు వీగిపోతాయి. ఆ తర్వాత ప్రయాణాలు..గమ్యాల దిశలు సైతం మారిపోతుంటాయి. ఎక్కవగా ఈ విధమై జోడీలను బాలీవుడ్ లో చూస్తుంటాం. అందుకు కారణాలు అనేకం. అవన్నీ వారి వ్యక్తిగత వ్యవహారాల కిందకు వస్తాయి. అయితే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న కొన్ని జంటల్ని దగ్గరగా పరిశీలిస్తే ఆ జంటలు పెళ్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? అన్న విషయం అర్ధమవుతుంది.
ప్రేమ అనేది టైంపాస్ కాదు..పెళ్లి వరకూ తీసుకెళ్తేనే అన్నింటా సక్సెస్ అవుతామని నిరూపించారని ఈ దంపతుల్ని చూస్తే అర్ధమవుతుంది. పెళ్లి కోసం ఆ దంపతులు కెరీర్ ని సైతం పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. పెళ్లికే పెద్ద పీట వేసి వీలైనంత త్వరగా 'మాంగళ్యం తంతునానేనా' అనిపించారు. కరీనాకపూర్-సైఫ్ అలీఖాన్ కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి విషయంలో ఎక్కువగా సమయం తీసుకోలేదు.
వీలైనంత వేగంగా ఈ జోడి వివాహ బంధంతో ఒకటయ్యారు. అలాగే కత్రినాకైఫ్- విక్కీ కౌశల్ కూడా ప్రేమ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించలేదు. ప్రేమ మొదలైన కొన్నాళ్లేకే పెళ్లి చేసుకున్నారు. గత డిసెంబర్ లోనే పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టేసారు. అలాగే ప్రియాంక చోప్రా మనసుకును నచ్చిన నిక్ జోనాస్ దొరకగానే కొన్నాళ్లు డేటింగ్ చేసి వెంటనే వివాహం చేసుకున్నారు. అమెరికాలో కాపురం పెట్టారు.
అలాగే అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో పెళ్లికి అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. దీపికా పదుకొణే-రణవీర్ సింగ్ ఎక్కువ కాలం ప్రేమించుకోలేదు. అప్పటికే దీపిక కొన్ని ఎదురుదెబ్బలు తిని ఉంది. ఈ విషయంలో దీపిక కాస్త జాగ్రత్త వహించి ప్రియుడ్ని ముందుగానే పెళ్లికి ప్రిపేర్ చేయించింది. అలా వేగంగానే రణవీర్ -దీపిక పెళ్లి జరిగిపోయింది.
అలియాభట్-రణబీర్ కపూర్ దంపతులు పెళ్లి చేసుకోవడానికి కాస్త సమయం పట్టినా అలియాభట్ ప్రేమలో పడిన దగ్గర నుంచి పెళ్లి విషయంలో తగు జాగ్రత్తలతో ముందుకు సాగింది. ఇటీవలే ఆ జంట వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హీరోయిన్లు తమ నటవృత్తిని సైతం పణంగా పెట్టారు.
గర్భం దాల్చిన సమయంలో కెరీర్ గ్యాప్ వస్తుందని తెలిసినా వాటిని పట్టించుకోకుండా వివాహ బంధానికే పెద్ద పీట వేసారు. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ప్రేమ..పెళ్లి విషయంలో ఈ దంపతులు ఎంతో నిజాయితీగా వ్యవహరించారని చెప్పొచ్చు. మరి ఈ జోడీల సరీసన అర్జున్ కపూర్-మలైకా అరోర్ ఇంకా బాలీవుడ్ లో ప్రేమలో మునిగి తేలుతోన్న ఇతర జటలు చేరాలని ఆశిద్దాం.