ఈగ విలన్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యాడు సుదీప్. కన్నడలో హీరోగా నటిస్తూనే తెలుగులో విలనీ చేసి మెప్పించాడు. ఆ తర్వాత కన్నడలో అతడు నటించిన సినిమాలన్నీ అనువాదాలుగా ఇక్కడ రిలీజయ్యాయి. ఆ రకంగా అతడు రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నాడు. ఇటీవలే జక్కన్న బాహుబలిలో ఓ ఐదునిమిషాల బిట్ లో మెరిశాడు. ఈ సినిమా తర్వాత అతడు నటించిన తమిళ చిత్రం 'పులి' రిలీజ్ కి రాబోతోంది. ఈ చిత్రంలో పూర్తి స్థాయి విలన్ గా నటించాడు సుదీప్.
ఆన్ సెట్స్ ఎక్స్ పీరియెన్స్ గురించి చెబుతూ... ''ఇందులో విలన్ గా ఛాలెంజింగ్ రోల్ చేశా. జానపదం, పైగా ఫాంటసీ సినిమా కాబట్టి నా గెటప్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. పొడవాటి తలవెంట్రులు, ఒంటినిండా ఆయుధాలు, కవచం చుట్టుముట్టేసినట్టే మేకప్ వేశారు. ఈ గెటప్ లో ఉన్నంత సేపూ కూచోడానికి లేదు. కూచోవాలంటే ఇవన్నీ తీసేయకపోతే కుదరనే కుదరదు. అందుకే ఒక షెడ్యూల్ అంతా నిలుచునే ఉన్నా. షూటింగ్ చాలా ఠఫ్ గా జరిగింది.. అని చెప్పుకొచ్చాడు.
బాహుబలి, పులి వంటి చిత్రాల్లో నటించడం నా అదృష్టం. తెలుగు, తమిళ పరిశ్రమలో ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది. కన్నడ చిత్రసీమలో పరిమిత బడ్జెట్ లతో సినిమాలొస్తున్నాయి. మిగతా పరిశ్రమలతో పోటీపడే సినిమాలొస్తాయని ఆశిస్తున్నా. వచ్చే ఏడాది ఐదు భాషల్లో ఓ ఫాంటసీ సినిమాకి దర్శకత్వం వహించాలనుకుంటున్నా.. అని మనసులోని మాట చెప్పాడు సుదీప్.