ఈగ సుదీప్ విడాకులు, భ‌ర‌ణం 19కోట్లు

Update: 2015-09-12 09:14 GMT
ఈగ చిత్రంతో టాలీవుడ్‌ - కోలీవుడ్‌ లో పాపుల‌ర్ అయ్యాడు సుధీప్‌. ఆ ఒక్క సినిమా ఇచ్చిన కిక్కుతో అత‌డికి సౌత్‌ లో అనూహ్యంగా మార్కెట్ పెరిగింది. ఓ వైపు తెలుగు సినిమాల్లో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తూనే క‌న్న‌డ‌లో స్టార్ హీరోగా కెర‌ర్‌ ని కొన‌సాగిస్తున్నాడు. ఇటీవ‌లే బాహుబ‌లితో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. సుదీప్ సినీకెరీర్ సూప‌ర్ హిట్‌. కానీ వ్య‌క్తిగ‌త జీవితం అట్ట‌ర్ ఫ్లాప్‌. ప్ర‌కాష్‌ రాజ్‌ - ప్ర‌భుదేవా వంటి దిగ్గ‌జాల బాట‌లోనే సుదీప్ కూడా భార్య‌కు విడాకులిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. డీటెయిల్స్‌ లోకి వెళితే..

శాండల్‌ వుడ్‌ స్టార్ హీరో సుదీప్- అతిని భార్య  ప్రియ రాధాకృష్ణన్ ఇక విడిపోనున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య బేధాభిప్రాయాలు రావ‌డంతోనే ఇద్ద‌రు గ‌త కొంత కాలంగా వేరు వేరుగా ఉంటున్న తరుణంలో.. ఈ జంట‌ శుక్ర‌వారం కోర్టులో విడాకులకు ఎప్లయ్‌ చేశారు. కారణంగా చెప్పకుండా విడిపోవడానికి సిద్దంగా ఉన్నాం అని కోర్టుకు తెలిపారు వీరు. అయితే ఈ విడాకుల‌కు సుదీప్  కోట్ల‌లో భ‌ర‌ణం చెల్లించాల్సిందేన‌ట. దాదాపు 19 కోట్ల సొమ్ముని  ప్రియ‌కు  చెల్లించనున్నాడు సుదీప్. అలాగే వారి 11 ఏళ్ళ కూతురు రక్షణ బాధ్యతను కూడా భార్య ప్రియకే అప్పగించనున్నాడు సుదీప్.  డైవర్స్‌ పిటీషన్‌ లో ఇష్టపూర్వకంగానే విడిపోతున్నట్లు కూడా తెలిపారు. కోర్టు విడాకులు ఇవ్వడమే తరువాయి.

హృతిక్‌రోష‌న్‌ - ప్ర‌కాష్‌ రాజ్‌ - ప‌వ‌న్‌ - ప్ర‌భుదేవా వంటి స్టార్లు ఇప్ప‌టికే భార్య‌ల‌కు విడాకులిచ్చారు. అప్ప‌ట్లో ఆ వార్త‌ల‌న్నీ సెన్సేష‌న్ అయ్యాయి. ఆ స్థాయిలో క‌న్న‌డ హీరో సుదీప్ విడాకుల కూడా శాండాల్ వుడ్‌ లో సెన్సేషన్‌ అయ్యింది. సుదీప్ అభిమానులు కొంత కాలంగా ఈ విష‌య‌మై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లో ఉన్నారు.
Tags:    

Similar News