సుదీర్ఘ కాల సినీ ఇండస్ట్రీ ప్రయాణంలో సుధ కొంగరకు ఎట్టకేలకు ఒక మంచి సక్సెస్ దక్కింది. మణిరత్నం అసిస్టెంట్ గా ఎప్పటి నుండో ఆమెకు పేరు ఉంది. సొంతంగా సినిమాలు చేసే ప్రయత్నం చేసినా కూడా అవి వర్కౌట్ కాలేదు. కొందరు ఆమెకు ఛాన్స్ లు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. తెలుగు దర్శకురాలు అయిన సుధ కొంగర ఎట్టకేలకు తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్లలో సూరారై పోట్రూ రిలీజ్ అయ్యి ఉంటే వంద కోట్లు వసూళ్లు నమోదు అయ్యేవి అనేది చాలా మంది బలమైన నమ్మకం. ఒక బ్రిలియంట్ మూవీ తెరకెక్కించారు అంటూ మహేష్ బాబు వంటి సూపర్ స్టార్స్ ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
విజయ్ దేవరకొండ వంటి వారు ఆమెతో వెంటనే వర్క్ చేయాలని కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈసమయంలోనే ఈమెను బుక్ చేసేందుకు చాలా మంది తెలుగు నిర్మాతలు కోటి అంతకు మించిన చెక్కుతో ఆమె వద్దకు వెళ్తున్నారు. కాని అడ్వాన్స్ లను సుధ కొంగర తిరష్కరిస్తున్నారట. అడ్వాన్స్ తీసుకుని సినిమా తర్వాత సినిమా చేయాలని తాను భావించడం లేదు అంటుంది. సినిమా తర్వాత సినిమా ఫలితాన్న బట్టి చేయాలనేది తన కోరిక అన్నట్లుగా ఒక తమిళ మీడియాతో మాట్లాడుతూ సుధ కొంగర అన్నారట. ప్రస్తుతం ఈమె తమిళ స్టార్ హీరో తో సినిమాకు రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఆ సినిమాను ప్రారంభించి ఆ సినిమా విడుదల తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచిస్తారట. ఈమె తీరు చూస్తుంటే తెలుగులో ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేనట్లుగా అనిపిస్తుంది.