`ద్రోహి` సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా రాణించలేదు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితిలో కమర్షియల్ గా మాసీవ్ హిట్ ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఆమె చేసిన చిత్రం `ఇరుది సుట్రు`. తమిళంలో స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సుధా కొంగరకు దర్శకురాలిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇదే చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ తో `గురు` పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడా ఫర్వాలేదనిపించింది. తాజాగా ఆమె సూర్యతో చేసిన చిత్రం `ఆకాశం నీ హద్దురా` బ్లాక్ బస్టర్ టాక్ తో ఓటీటీలో ఏల్తోంది.
ఏయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపీనాథ్ జీవికథ ఆధారంగా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసల్ని అందుకుంటోంది. సూర్య క్యారెక్టర్.. ఆయన నటన.. సినిమాని సుధా కొంగర ఎమోషనల్ కంటెంట్ తో నడిపించిన తీరు ప్రశంసలు కురిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలుగమ్మాయి కం లేడీ డైరెక్టర్ సుధా కొంగర తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. రిలీజ్‌కు ముందే సూర్య ఈ మూవీ ఫలితంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారని... ఖచ్చితంగా హిట్ కొడుతున్నామని ఆమెతో చెప్పారట. సినిమా చూసిన తెలుగు- తమిళ భాషలకు చెందిన స్టార్స్ తనని ప్రశంసల్లో ముంచెత్తారని వెల్లడించింది.
`గురు` తరువాత తెలుగు నుంచి సుధా కొంగరకు చాలా ఆఫర్లు వచ్చాయట. అప్పటికే `ఆకాశం నీ హద్దురా` అంగీకరించడంతో తెలుగు ప్రాజెక్ట్ లు ఏవీ ఫైనల్ చేయలేదని తెలిపింది. `ఆకాశం నీ హద్దురా`హ్యూజ్ హిట్ తరువాత సుధా కొంగర పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాన్నానని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తానని ఈ సందర్భంగా సుధా కొంగర స్పష్టం చేశారు.