బ్యాడ్మింటన్ సెన్సేషన్.. కోచ్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ గురించి చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఈ సినిమాకి గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తారని.. స్క్రిప్టు వర్క్ పూర్తయిందని కూడా ప్రచారమైంది. కానీ ఇప్పటివరకూ ఈ మూవీని పట్టాలెక్కించలేకపోయారు. సెట్స్ కెళ్లాలని ప్రాక్టీస్ చేసినా కోవిడ్ దెబ్బకు ఇన్నాళ్లు వాయిదా పడిపోయింది.
ఇక జాతీయ అవార్డు గ్రహీతగా ప్రవీణ్ సత్తారు ప్రతిభను గుర్తించిన బాలీవుడ్ నిర్మాణ సంస్థలకు అతడితో పని చేసేందుకు అభ్యంతరం లేదు కానీ.. కార్పొరెట్ ఫార్మాల్టీస్ ప్రకారం.. రచయితలతో స్క్రిప్టు వర్క్ విషయం రీసెర్చ్ వగైరా చాలా ఆలస్యమయ్యాయి. నిజానికి ప్రవీణ్ కి ఆ బాధ్యత అప్పజెబితే ఈపాటికే పూర్తయ్యేదేమో!
కానీ అంతా కార్పొరెట్ సీన్ కావడం.. బహుభాషా చిత్రం కావడంతో దీనిపై ఫోకస్ ఎక్కువ పెట్టిన సదరు కార్పొరెట్ బ్యానర్లు కాగల కార్యాన్ని కానిచ్చేయడంలో చాలా ఆలస్యం చేసి విసిగించాయని గుసగుస వినిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో సుధీర్ బాబు స్వయంగా `వి` ప్రమోషన్స్ లో ఈ బయోపిక్ గుట్టు బయట పెట్టారు. ఈ ప్రాజెక్టు ఆగిపోలేదని డిసెంబర్ లో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇక గోపిచంద్ తన స్నేహితుడు కాబట్టి ఆ పాత్రలో తనే నటిస్తానని సుధీర్ బాబు తొలి నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి మూవీకి హిందీలోనూ మార్కెట్ ఉంటుంది కాబట్టి భాఘి నటుడిగా అది అతడికి కూడా ప్లస్ అవుతుందేమో!
కానీ ఇదిగో పులి అంటే అదిగో మేక! అన్న చందంగా ఈ క్రేజీ బయోపిక్ అంతకంతకు లేటవుతోంది. మరి ఇప్పటికైనా పూర్తి క్లారిటీకొస్తారంటారా? అలాగే ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించరని డిసెంబర్ నాటికి నాగార్జునతో సినిమా మొదలు పెడతారని మరో ప్రచారం వేడెక్కిస్తోంది. అయితే ఇది నిజమా కాదా? అన్నది స్వయంగా దర్శకుడు ప్రవీణ్ వెల్లడించాల్సి ఉంటుందేమో!