బాలీవుడ్ లో ఎప్పుడో మొదలైంది కానీ టాలీవుడ్ లో మాత్రం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న బయోపిక్ ల సీజన్ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా నన్ను దోచుకుందువటే ప్రమోషన్స్ కోసం ఇంజనీరింగ్ కాలేజీలు చుట్టేస్తున్న హీరో సుధీర్ బాబు త్వరలో సూపర్ స్టార్ కృష్ణ గారి బయోపిక్ ఉంటుందని త్వరలో వివరాలు ప్రకటిస్తామని చెప్పడం సంచలనంగా మారింది. నిజానికి ఈ న్యూస్ అటు కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ ఇప్పటి మహేష్ యువతరం ఫ్యాన్స్ కానీ ఎవరూ ఊహించింది కాదు. అంటే కృష్ణ గారి జీవితాన్ని తెరమీద చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న హింట్ సుధీర్ బాబు ఇచ్చేసాడు. అది తనకు నట జీవితాన్నిచ్చిన మావయ్య కోసం తనే నిర్మిస్తాడా లేక ఇది ఇంకెవరైనా టేకప్ చేస్తారా అనే వివరాలు మాత్రం బయట పెట్టడం లేదు. జస్ట్ వెయిట్ అండ్ సి అంటున్నాడు. కాకపోతే దీని సాధ్యాసాధ్యాల వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి.
ఎన్టీఆర్ గారికి ఏ మాత్రం తీసిపోని రీతిలో కృష్ణ గారి జీవితం ఉంటుంది. కాకపోతే రాజకీయాల్లో ఎక్కువ కాలం మన్నలేదు కాబట్టి వివాదాలు అంతగా లేవు. కానీ చెప్పుకోదగ్గ సంఘటనలు కోకొల్లలు. ముఖ్యంగా టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చాక కృష్ణ గారు ఎన్టీఆర్ వ్యవహారశైలి నచ్చక ఆయన మీద సైటరికల్ సినిమాలు తీశారు. అల్లూరి సీతారామరాజు షూటింగ్ మొదలుకుని దానవీర శూరకర్ణతో కురుక్షేతం రిలీజ్ క్లాష్ అవ్వడం దాకా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది. ఇవన్ని ఇందులో చూపిస్తారా అనేది వేచి చూడాలి. పైగా కృష్ణ గారి వైవాహిక జీవితాన్ని రెండు దశల్లో చూపాలి. మహేష్ తల్లి ఇందిర గారు ఆ తర్వాత విజయనిర్మల గారు ఇద్దరినీ ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇక కృష్ణ నటించిన 300 పైచిలుకు సినిమాల నిర్మాణాల్లో వందల వేల మర్చిపోలేని జ్ఞాపకాలు. ఇవన్నీ రెండున్నర గంటల సినిమా స్క్రిప్ట్ కు అనుగుణంగా కుదించడం ఒక పెద్ద సవాల్ అయితే కృష్ణ గారి పాత్రలో పరకాయప్రవేశం చేసేంత క్యాలిబర్ ఉన్న నటుడిని సెట్ చేసుకోవడం. ఫ్యాన్స్ మహేష్ పేరు చెబుతారు కానీ ప్రిన్స్ అంత సాహసానికి వెంటనే ఒప్పుకోకపోవచ్చు. మరి సుధీర్ అన్నట్టు వివరాలు బయటికి వచ్చాక ఈ సందేహాలకు తెర పడుతుంది.