విస్కీ బాటిల్ ముందు పెట్టుకొని ఫ్రెండ్ ని పరిచయం చేసిన సూపర్ స్టార్ అల్లుడు...!
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు సుధీర్ బాబు. కెరీర్ స్టార్టింగ్ నుండి విలక్షణమైన పాత్రలను కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. ఈ క్రమంలో 'ప్రేమ కథా చిత్రమ్' 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' 'భలే మంచి రోజు' 'భాగీ' 'శమంతకమణి' 'సమ్మోహనం' సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం సుధీర్ బాబు.. నానితో కలిసి నటించిన 'వి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లేకపోవడంతో సుధీర్ బాబు తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాడు. కాగా సుధీర్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ తన ఫ్రెండ్ విజయ్ చిల్లా ప్రొడక్షన్ లో చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. విజయ్ చిల్లా ఇంతకముందు 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'భలే మంచి రోజు' 'ఆనందో బ్రహ్మ' 'యాత్ర' సినిమాలను నిర్మించారు.
సుధీర్ బాబు ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో వెల్లడిస్తూ ''నేను మొన్న చెప్పినట్లుగా ఇప్పుడు నా యార్.. నా సూపర్ స్టార్.. నా బెస్ట్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తున్నాను. మా గురించి మీకు తెలియని ఒక చిన్న కథ ఉంది. విజయ్ నేను కలిసి పెరిగాము. సిమిలర్ ఇంట్రెస్ట్స్ పెంచుకున్నాము. కానీ మా కెరీర్ విషయానికి వస్తే మొదట్లో మేము వేర్వేరు మార్గాల్లోకి వెళ్ళాము. కాని చివరికి మేమిద్దరం సినీ పరిశ్రమ అనే పెద్ద ప్రపంచంలో అడుగుపెట్టాము. నేను నటించిన 'భలే మంచి రోజు' చిత్రాన్ని విజయ్ నిర్మించారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కోసం మేము కలిసి పనిచేయబోతున్నాం. ఇవి చాలా మంది తమ స్నేహితులతో పంచుకోని ప్రత్యేకమైన జ్ఞాపకాలు! ఈ క్లిష్ట సమయాల్లో నేను అతనితో కలవలేకపోతున్నాను. కానీ టెక్నాలజీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను నా సూపర్ స్టార్ - నా యార్.. కొత్త సూపర్ స్టార్ తో మంచి సమయాన్ని గుర్తుచేసుకుంటున్నాను'' అని పోస్ట్ పెట్టారు. దీనికి ప్రొడ్యూసర్ విజయ్ చిల్లాతో వీడియో కాల్ మాట్లాడుతున్న స్క్రీన్ షాట్ జత చేసారు. దీనికి #No1Yaari #McDowellsNo1 #DrinkResponsibly #paidpartnership అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టాడు. ఈ ఫొటోలో సుధీర్ బాబు టేబుల్ పై మెక్ డొనాల్డ్స్ విస్కీ బాటిల్ తో పాటు గ్లాస్ కనిపించగా.. విజయ్ కూడా చేతిలో గ్లాస్ పట్టుకొని కనిపించాడు.
కాగా సుధీర్ బాబు మెక్ డొనాల్డ్స్ నెం.1 సూపర్ స్టార్ అంటూ తన ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ బాబు మూవీ ప్రమోషన్స్ తో పాటు ఇలా ఇండైరెక్టుగా మెక్ డొనాల్డ్స్ బ్రాండ్ కి పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నట్లున్నారనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది సెలబ్రిటీలు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుధీర్ కూడా తన మూవీకి పబ్లిసిటీ చేసుకోవడంతో పాటు బ్రాండ్ ప్రమోషన్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం ఫ్రెండ్స్ షిప్ పేరుతో ఆల్కాహాల్ ప్రమోట్ చేయడం ఏమీ బాగాలేదని.. మరికొందరు మీరు డ్రింక్ చేస్తూ అలాంటి బాడీ మైంటైన్ చేస్తున్నారా? అని కామెంట్స్ చేస్తున్నారు.