ఎక్స్ క్లూసివ్: పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ ఈ ఏడాదైనా స్టార్ట్ చేసే అవ‌కాశం ఉందా?

Update: 2020-06-03 06:30 GMT
* హాయ్ సుధీర్ ఎలా ఉన్నారు - ఈ క్వారంటైన్ ఫ్రీ టైమ్ ని ఎలా గ‌డుపుతున్నారు?

హాయ్ నేను బావున్నా - మీరు బావున్నారా - ఫ్యామిలీ మీ సైట్ లో ఉన్న టీమ్ అంద‌రూ ఎలా ఉన్నారు - ఆల్ గుడ్ క‌దా - ఎస్ ఇక నా క్వారంటైన్ ఖాళీని మొత్తం నా ఫిట్ నెస్ మీద ఫోక‌స్ పెట్టాను - అలానే నా ఫ్యామిలీతో కొంత ఫ్రీగా ఎలాంటి టెన్ష‌న్స్ లేకుండా టైమ్ స్పెండ్ చేస్తున్నా. అలానే ఇంటి ద‌గ్గ‌రే ఉండి - ఫిట్ నెస్ ఎలా మెయింటైన్ చేయాలో కొన్ని టిప్స్ రిలీజ్ చేసి నా సోష‌ల్ మీడియా ఎకౌంట్స్ లో కూడా పెట్టాను. వాటికి మంచి స్పంద‌న ల‌భించింది.

* ఎస్ మీ ఫిట్ నెస్ వీడియోల‌కి మంచి స్పంద‌న ల‌భించింది - మా టీమ్ అంతా బాగున్నాం - కొత్త క‌థ‌లు ఏమైనా విన్నారా ఈ మ‌ధ్య‌?

విన్నాను - జూమ్ ద్వారా ఇటీవ‌లే కొన్ని స్టోరీలు విన్నాను - వాటి పై ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు. కొన్ని ప్రాజెక్ట్స్ లూప్ లైన్ లో ఉన్నాయి. వాటిని ఈ క్రైసిస్ ప్ర‌భావం త‌గ్గిన వెంట‌నే మొద‌లుపెట్టే ఆలోచ‌న‌లో ఉన్నాను.

* నిర్మాత‌గా కూడా మ‌ళ్లీ బిజీ అవ్వ‌బోతున్నారు అనుకోవ‌చ్చా?

ఎస్ అవునండి - నేను ఒకే చేసిన నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు నా బ్యాన‌ర్ సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్న. మ‌రికొన్ని బ‌య‌ట బ్యాన‌ర్లు ప్రొడ్యూస్ చేస్తున్న వాటిలో న‌టిస్తున్న‌.

* సంవ‌త్సరం గ్యాప్ వ‌చ్చింది - అయినా మోస్ట్ డిజైర్ బుల్ లిస్ట్ లో టాప్ 10 లో ఉన్నారు - దీని పై మీ స్పంద‌న‌?

మీరు గుర్తు చేసే వ‌ర‌కు నాకే ఐడియా లేదండి - నేను సింగిల్ గా ఆన్ స్క్రీన్ క‌నిపించి ఇన్నాళ్లు అయిందా అనిపిస్తోంది. అయితే కంటిన్యూగా వ‌ర్క్ చేస్తూ ఉండ‌టం వ‌ల‌నేమో నాకు అంత గ్యాప్ వ‌చ్చిన‌ట్లు అనిపించ‌లేదు. అలానే మీ ద్వారా - సోష‌ల్ మీడియా కార‌ణంగా ఎప్పుడూ నేను ఫ్యాన్స్ తో ట‌చ్ లోనే ఉంటున్నా - అందువ‌ల్లేనేమో మోస్ట్ డిజైర్ బుల్ లిస్ట్ లో కూడా ఉన్నాను నా అభిప్రాయం.

* మీరు నిర్మాత‌గా - హీరోగా మ‌ల్టీ రోల్స్ చేస్తున్నారు - ఓటీటీలు ప్ర‌భావం చిత్ర ప‌రిశ్ర‌మ పై ఎలా ఉండ‌బోతుంద‌నుకుంటున్నారు?

హీరోగా లేదా ఓ యాక్ట‌ర్ గా ఓటీటీలు రాక‌ను నేను స్వాగ‌తిస్తాను ఎందుకంటే ఓటీటీలు రాక‌తో చిత్ర నిర్మాణం పుంజుకుంటుంది. అంటే నా ఉద్దేశం ఓరిజ‌న‌ల్ మూవీస్ - వెబ్ సీరిస్ లు ఇలా దీని వ‌ల్ల చాలా మంది ఆర్టీస్టుల‌కు - టెక్న‌షీయ‌న్ల‌కి ఉపాధి దొరుకుతుంది. అంతేకాదు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్లు - ఎక్స్ పీరియన్సులు బ్యాకింగ్ లేకుండా అవ‌కాశాలు దొరుకుతాయి. టాలెంట్ మాత్ర‌మే ప్రామాణికంగా చిత్ర నిర్మాణం జ‌రిగే దిశ‌గా ఓటీటీలు ప్ర‌భావం ఇండ‌స్ట్రీ మీద ప‌డుతుందని నా ప‌ర్స‌న‌ల్ ఫీలింగ్. ఇక నిర్మత‌గా ఓటీటీలు ప్ర‌భావం థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ ని ఏ మాత్రం త‌గ్గించ‌లేవు అని నేను బ‌లంగా న‌మ్ముతున్న, అయితే ప్ర‌స్తుతం ఈ క్రైసిస్ లో ఫైనాన్సియ‌ల్ స్ట్రగుల్స్ ఉన్న నిర్మాత‌ల‌కి మాత్రం వేరే ఆప్ష‌న్స్ ఉండ‌దు కాబ్బ‌ట్టి ప్ర‌స్తుతం వారంతా ఓటీటీలు వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ ఒక్క‌సారి ఈ ఆంక్ష‌లు ఎత్తేసిన వెంట‌నే ఏ నిర్మాత కూడా ఓటీటీల్లో డైరెక్ట్ రిలీజ్ చేయ‌రు అనుకుంటున్న‌.

* కృష్ణ గారు మీద స్పెష‌ల్ వీడియో చేసి ఆయ‌న‌కే చూపించారు, ఆయ‌న రియాక్ష‌న్ ఏంటి?

ఆయ‌న‌కు ఆయ‌న న‌టించిన సినిమాలు - సీన్లు గుర్తుచేద్దామ‌నే ఫ్యామిలీ అంతా ఈ ప్లాన్ చేశాము. ఆయ‌న ఈ వీడియో చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అప్ప‌ట్లో జ‌రిగిన సంఘ‌ట‌ణ‌లు అన్ని గుర్తుచేసుకున్నారు.

* పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ ఈ ఏడాదైనా స్టార్ట్ చేసే అవ‌కాశం ఉందా?

(న‌వ్వులు) ఈసారి డిలై ఉండ‌దు - పక్క ఈ లాక్ డౌన్ క్రైసిస్ ముగిసిన వెంట‌నే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకువ‌స్తాము.

* ఇంత‌కీ ఎందుకంత డిలే అయిన‌ట్లు?

ముందు మేము ఈ ప్రాజెక్ట్ ని సింగిల్ డిజిట్ బ‌డ్జెట్ లో చేద్దాము అనుకున్నాం - ఆ త‌రువాత అది కాస్త డ‌బుల్ డిజిట్ అయింది. ఈ బడ్జెట్ కి సంబంధించిన వ్య‌వ‌హారాలు కార‌ణంగానే ఈ డిలే. మా టీమ్ మొత్తం ఎక్క‌డా కాంప్రమైజ్ అవ్వకూడ‌ద‌ని ఫిక్స‌య్యాము. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన షూటింగ్ లో 80 - 90 ల్లో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌ణ‌లు రీక్రియేట్ చేయాలి. దీనికి చాలా టైమ్ అలానే బ‌డ్జెట్ కూడా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ని నేను చాలా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న‌.

* మీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో పాటు లాక్ డౌన్ రిలాక్ష‌న్ అయిన వెంట‌నే రిలీజ్ కి రెడీ గా ఉన్న వీ ఆ త‌రువాత ప్రాజెక్ట్స్ అన్ని స‌క్సెస్ అవ్వాల‌ని మా తుపాకీ డాట్ కామ్ టీమ్ మ‌నః స్పూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్

థ్యాంక్యూ - తుపాకీ డాట్ కామ్ రీడ‌ర్స్ అంద‌రూ బీ సేఫ్ - క‌రోనా వెక్సీనేష‌న్ వ‌చ్చే వ‌రకు మ‌నంద‌రం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అత్యఅవ‌స‌రం అయితేనే బ‌య‌ట‌కు రండి.




Tags:    

Similar News