'శ్రీదేవి సోడా సెంటర్' సెన్సార్ పూర్తి.. సినిమా నిడివి ఎంతంటే..?

Update: 2021-08-24 08:30 GMT
'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా రూపొందిన తాజా చిత్రం ''శ్రీదేవి సోడా సెంటర్''. ఇందులో ఆనంది హీరోయిన్ గా నటించింది. రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 27న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వదిలిన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఇకపోతే 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించిన చిత్ర యూనిట్.. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'యూ/ఏ' (U/A) సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సినిమా రన్ టైమ్ రెండున్నర గంటలు (2 గంటల 34 నిమిషాలు) వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన సుధీర్ బాబు - ఆనంది అందమైన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో 'శ్రీదేవి సోడా సెంటర్' మేకర్స్ అగ్రిసివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవలే నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం ఈ సినిమా స్టొరీ తెలుసుకొని చిత్ర బృందాన్ని అభినందించి, తన విషెస్ తెలియజేసారు. కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్న సుధీర్ బాబు.. లైటింగ్ సూరిబాబు గా కనిపించనున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఇప్పటికే ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న పావెల్ నవగీతన్ ని పరిచయం చేసిన చిత్ర యూనిట్.. తాజాగా సోడాల శ్రీదేవి తండ్రి సంజీవ్ రావు గా నటించిన సీనియర్ నరేష్ కు సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేశారు. సోడా కొట్టు ఓనర్ గా.. కూతురిపై అమితమైన ప్రేమ గల తండ్రిగా.. పరువు కోసం తాపత్రయ పడే కుటుంబ పెద్దగా ఈ సినిమాలో నరేష్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్ర సినిమా సక్సెస్ కు ఏ విధంగా దోహదపడుతుందో చూడాలి.

'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రంలో సత్యం రాజేష్ - రఘుబాబు - అజయ్ - హర్షవర్ధన్ - సప్తగిరి - రోహిణి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 'భలే మంచి రోజు' తర్వాత ఈ బ్యానర్ లో సుధీర్ బాబు చేస్తున్న రెండో సినిమా ఇది. మరి 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రం థియేటర్స్ లో ఎలాంటి సౌండింగ్ చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News