గొంతు గుట్టు విప్పు సుధీర్ బాబు

Update: 2018-10-16 06:45 GMT
నిన్న విడుదలైన వీర భోగ వసంత రాయలు ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ అందులో సుధీర్ బాబుకు వేరొకరు డబ్బింగ్ చెప్పడం మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన మొదటి సినిమా తప్ప ఇప్పటిదాకా అన్నింటికీ తన స్వంత గొంతునే ఇచ్చిన సుధీర్ దీనికి మాత్రం ఎందుకు హ్యాండ్ ఇచ్చాడో అని ఆలోచనలో పడ్డారు అభిమానులు. ఇది కేవలం ట్రైలర్ కు మాత్రమే పరిమితం చేసి సినిమా ఫైనల్ వెర్షన్ కి అతనితోనే చెప్పిస్తారా లేక ఇప్పుడున్న స్వరమే అప్పుడు కూడా వినిపిస్తుందా అనే దాని మీద క్లారిటీ లేదు.

సాధారణంగా ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. రిలీజ్ డేట్ దగ్గరలో ఉండి సదరు ఆర్టిస్టు అందుబాటులో లేకపోవడం లేదా ఏవైనా విభేదాల కారణంగా అలకల మూలంగా నేను చెప్పను పొమ్మని నిరాకరించడం జరుగుతూ ఉంటాయి. లేదా నాగబాబు లాగా గొంతుకు సంబంధించిన అనారోగ్యం ఏదైనా వచ్చినప్పుడు మేనేజ్ చేయడం. కానీ సుధీర్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు. హీరో. పైగా కథలో కీలకమైన పాత్రని తనే ఇంతకు ముందు చెప్పాడు. మరి ఏమైందో కానీ దీనికి రీజన్ బయట పడాల్సి ఉంది.

జగపతిబాబు కెరీర్ మొదట్లో ఇలాగే డబ్బింగ్ వేరేవాళ్లతో మానేజ్ చేసారు. సింహాసనం మొదలుకుని పెద్దరికం దాకా వేరే వాయిస్ ఉంటుంది. గాయం నుంచి వర్మ జగ్గు వాయిస్ లోని ఫైర్ బయటికి తీసుకొచ్చాడు. సింగం ఫస్ట్ పార్ట్ లో ప్రకాష్ రాజ్ పారితోషికం విషయంలో వచ్చిన వివాదం మూలంగా డబ్బింగ్ చెప్పకపోవడంతో వేరే వాళ్ళతో చెప్పిస్తే తేడా కొట్టేసింది. ఈ మధ్య పూజా హెగ్డే- సమంతా- వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి పరభాషా హీరోయిన్లే సహజత్వం కోసం స్వంతంగా డబ్బింగ్ చెబుతుంటే తెలుగువాడైన సుధీర్  మాత్రం ఎందుకు చెప్పలేదో ట్విట్టర్ లో ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

అసలు ట్విస్ట్ ఏంటంటే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో సుధీర్ బాబు ఇంతవరకు ట్రైలర్ ని షేర్ చేసుకోలేదు. ఏదో మతలబు ఉన్నట్టే అనిపిస్తోంది కదూ.


Watch Here : https://www.youtube.com/watch?v=KT6875hyV1U
Tags:    

Similar News